యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ‘బాహుబలి’తో ప్రభాస్ కు వరల్డ్ వైడ్ క్రేజ్ రాగా దానిని కంటిన్యూ చేస్తూ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.
Also Read: జబర్దస్త్ కమెడియన్ కు జలక్ ఇచ్చిన నాగబాబు.. బిగ్ బాస్ విన్నర్ అతడేనట?
‘బాహుబలి’ సిరీసుల తర్వాత ప్రభాస్ తన సొంత బ్యానర్లో ‘సాహో’ మూవీని నిర్మించాడు. ఈ మూవీతో తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేకపోయినా ఉత్తరాధి ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ‘రాధేశ్యామ్’ కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కుతోంది.
‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీలో.. బాలీవుడ్ దర్శకుడు ఓంరావత్ తెరకెక్కించనున్న ‘ఆదిపురుష్’లో నటించనున్నాడు. నాగ్ అశ్విన్ మూవీలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ నిత్యం ఏదో ఒక అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. ‘ఆదిపురుష్’ ఫస్టు లుక్ తోనే ఆకట్టుకుంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కన్పించబోతుండగా సైఫ్ అలీఖాన్ ‘లంకేష్’గా నటిస్తున్నాడు. ఇప్పటికే రావణుడికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్ కు జోడీగా ‘సీత’ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Also Read: బిజినెస్ మొదలెట్టిన ఆనంద్ దేవరకొండ
‘ఆదిపురుష్’లో సీత పాత్రలో అనన్య పాండే నటిస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అనన్య పాండే ప్రస్తుతం ‘ఫైటర్’ మూవీలో నటిస్తోంది. పూరి జగన్మాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’లో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తోంది. ‘ఆదిపురుష్’లో సీత క్యారెక్టర్ కోసం చిత్రయూనిట్ ఆమెను సంప్రదిస్తున్నారనే గాసిప్ విన్పిస్తోంది. ఆమెతోపాటు అనుష్క శర్మ.. కీర్తి సురేష్.. కృతిసనన్.. కియారా అడ్వాణీ పేర్లు విన్పిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రభాస్ ‘ఆదిపురుష్’ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్డమ్ కు తగ్గట్టుగానే అతడికి పారితోషికం ముడుతుందని సమాచారం. ప్రభాస్ కు పారితోషికంతోపాటు లాభాల్లో వాటాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభాస్ నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నాడనే టాక్ విన్పిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
దీంతో ప్రభాస్ కు ఈ మూవీ ద్వారా భారీగానే పారితోషికం అందడం ఖాయంగా కన్పిస్తోంది. ‘ఆదిపురుష్’ మూవీని 400కోట్ల భారీ బడ్జెట్ తో టీ సీరిస్ నిర్మిస్తోంది. త్రీడీ టెక్నాలజీ.. గ్రాఫిక్ మాయజాలంతో సినిమా రాబోతుంది. తెలుగు, హిందీలో ఈ మూవీని తెరక్కించి మిగతా అన్ని భాషల్లో డబ్ చేయనున్నారు ‘ఆదిపురుష్’ మూవీని 11-08-2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రయూనిట్ ఇటీవలే సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.