https://oktelugu.com/

జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ మేనిఫెస్టో విడుదల.. వరాలు ఇవే 

అన్నట్టుగానే హైదరాబాదీలపై బీజేపీ వరాల వాన కురిపించింది. వారిని వరాలతో తడిసేలా చేసింది. అందరూ ఊహించినట్టే వరద బాధితులకు పెద్ద సాయం ప్రకటించింది. ఏకంగా రూ.25వేల సాయం చేస్తామని ప్రకటించింది. ఇక గ్రేటర్ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఉచితంగా చేపడుతామని ఎన్నికల హామీ ఇచ్చింది. Also Read: పీవీ, ఎన్టీఆర్‌‌లను వదలని ‘కాషాయ’ దండు ఈరోజు హైదరాబాద్ లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. […]

Written By: NARESH, Updated On : November 26, 2020 3:05 pm
Follow us on

అన్నట్టుగానే హైదరాబాదీలపై బీజేపీ వరాల వాన కురిపించింది. వారిని వరాలతో తడిసేలా చేసింది. అందరూ ఊహించినట్టే వరద బాధితులకు పెద్ద సాయం ప్రకటించింది. ఏకంగా రూ.25వేల సాయం చేస్తామని ప్రకటించింది. ఇక గ్రేటర్ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఉచితంగా చేపడుతామని ఎన్నికల హామీ ఇచ్చింది.

Also Read: పీవీ, ఎన్టీఆర్‌‌లను వదలని ‘కాషాయ’ దండు

ఈరోజు హైదరాబాద్ లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. గురువారం మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలకు మేరకు బీజేపీ మేనిఫెస్టో రూపొందించామని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కాలక పాత్ర పోషించిందని.. గెలిస్తే గ్రేటర్ లో ఎల్.ఆర్ఎస్ రద్దు చేస్తామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ తో రూ.15వేల కోట్లు భారం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: తిరుపతి బరి: గెలిచే సత్తా ఎవరికుంది?

*బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ..
* వరద బాధితులకు రూ.25వేలు సాయం
* హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు చేస్తాం
* పక్కా ప్రణాళికతో అక్రమ నిర్మాణాల తొలగింపు
* ప్రతి డివిజన్ కు నాలుగు స్మశాన వాటికలు
* బీజేపీ గెలిస్తే సెప్టెంబర్ 17 అధికారిక విమోచన దినోత్సవం
* ప్రతీ డివిజన్ లో గ్రీవెన్స్ సెల్
* హెల్త్ అడ్వైజరీ సెల్ ఏర్పాటు
* సెలూన్లకు ఏటా రూ.15వేల వడ్డీ లేని రుణం
* కార్మికులకు రూ.5లక్షల ఆరోగ్య బీమా
* ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7వేల సాయం
* పాతబస్తీలో కరెంట్ చౌర్యానికి చెక్
* జీహెచ్ఎంసీ ద్వారా ఉచితంగా కరోనా టెస్టులు, వ్యాక్సిన్.
* గ్రేటర్ పరిధిలో లక్ష మంది పేదలకు ఇళ్ల పంపిణీ
* జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
* ఓల్డ్ సిటీ ప్రతి డివిజన్ కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు
* జీహెచ్ఎంసీ పరిధిలో 28వేల కొత్త నియామకాలు
* హైదరాబాద్ నలువైపులా డంపింగ్ యార్డులు
* బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టో
* ఓల్డ్ సిటీ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్