https://oktelugu.com/

Samantha: నాగచైతన్యతో విడాకులపై ఈ ఒక్క ట్వీట్ తో సమంత క్లారిటీ

Samantha: స్టార్ హీరో సమంత వ్యవహారం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆమె తన ఇంటిపేరుగా ‘అక్కినేని’ అని తొలగించి కేవలం ‘ఎస్’ అని పెట్టుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకు మార్చుకుందని మీడియాలో అడిగినా కూడా సమాధానాన్ని సమంత దాటవేసింది. ఈ క్రమంలోనే సమంత-నాగచైతన్యల మధ్య ఏదో గొడవ జరుగుతోందని.. త్వరలోనే ఈ జంట విడిపోనున్నారనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. సమంత చేస్తున్న కొన్ని పనులు కూడా దీనికి ఆజ్యం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2021 / 09:41 AM IST
    Follow us on

    Samantha: స్టార్ హీరో సమంత వ్యవహారం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆమె తన ఇంటిపేరుగా ‘అక్కినేని’ అని తొలగించి కేవలం ‘ఎస్’ అని పెట్టుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకు మార్చుకుందని మీడియాలో అడిగినా కూడా సమాధానాన్ని సమంత దాటవేసింది.

    ఈ క్రమంలోనే సమంత-నాగచైతన్యల మధ్య ఏదో గొడవ జరుగుతోందని.. త్వరలోనే ఈ జంట విడిపోనున్నారనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. సమంత చేస్తున్న కొన్ని పనులు కూడా దీనికి ఆజ్యం పోసినట్లుగా అనిపించింది.

    ఇక గత కొన్ని రోజులుగా అక్కినేని కుటుంబ వేడుకల్లో సమంత కనిపించడం లేదు. నాగచైతన్యతో కలిసి కనిపించకపోవడంతో ఈ పుకార్లకు బలం చేకూరుతోంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో మీడియా దీనిపై ప్రశ్నించగా భగ్గుమంది. ‘గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బుద్ది లేదా?’ అని ఘాటుగా జవాబు ఇచ్చింది. దీంతో ఈ చర్చ మరింత పెరిగింది.

    ఇన్ని వివాదాల నడుమ.. సమంత ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్ట్ తాజాగా వైరల్ అయ్యింది. సమంత-చైతన్యల మధ్య ఎలాంటి గొడవలు లేవన్న వాదనకు బలం చేకూరుతోంది. అక్కినేని జయంతి సందర్భంగా నాగార్జున చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన సమంత ‘ఇది చాలా అద్భుతంగా ఉంది నాగార్జున మామ’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో సమంత అక్కినేని కుటుంబానికి దూరమవుతుందని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పకనే చెప్పిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ పుకార్లకు చెక్ పడుతుందా లేదా? అన్నది చూడాలి.

    https://twitter.com/Samanthaprabhu2/status/1439926164034768900?s=20