
ఐపీఎల్ 14వ సీజన్ దశను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమితో ఆరంభించింది. దీనిపై కోహ్లీ స్పందించాడు. ఈ వికెట్ పై మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం ఎంతో ముఖ్యం. అయితే, ఆదిలోనే వికెట్ పై తేమ అంత ప్రభావం చూపిస్తుందని మేం ఊహించలేదు. తొలుత బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నాం. అలాగే 40 పరుగుల దాకా మేం ఒక్క వికెటే కోల్పోయాం. ఆ తర్వాత 20 పరుగుల్లోనే ఐదు వికెట్లు పోగొట్టుకున్నారం.
ఇక అక్కడి నుంచి కోలుకునే ప్రసక్తే లేకపోయింది. ఇది మాకు మేలు కొలుపు లాంటిది. రెండో దశలో ఆదిలోనే ఇలా జరగడం వల్ల మున్ముందు ఏయే విషయాలపై దృష్టిసారించాలో తెలిసొచ్చింది. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడాలి అని కోహ్లీ తెలిపాడు.
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. త్వరలోనే అతడు టీమ్ ఇండియాకు ఆడతాడన్నాడు. యువకుల నుంచి ఇలాంటి ప్రదర్శనలు చూడాలని, దాంతో టీమ్ ఇండియా రిజర్వ్ బెంచ్ ఎంత బలంగా ఉందో తెలుస్తోందని అతడు చెప్పుకొచ్చాడు. ఒక బెంగళూరు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు గెలించిందని, అప్పుడప్పుడూ ఓటములు కూడా ఎదురౌతాయని అన్నాడు. విజయాలలాగే వైఫల్యాలకు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. కచ్చితమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని, ఈ జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని కోహ్లీ వివరించారు.