YS Sharmila: వైఎస్ షర్మిల రెడీ.. చేవేళ్ల నుంచి పాదయాత్ర

YS Sharmila: తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ గా తండ్రి ప్రారంభించే చేవెళ్ల నుంచే తన పాదయాత్ర మొదలు కానున్నట్లు తెలిపారు. పాదయాత్ర ద్వారా పార్టీ బోలోపేతం చేసే దిశగా వెళ్లనున్నట్లు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు అమ్ముడుపోయాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలన ఎండగడుతూ ఎక్కడికక్కడ ప్రజలను […]

Written By: Raghava Rao Gara, Updated On : September 21, 2021 12:27 pm
Follow us on

YS Sharmila: తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ గా తండ్రి ప్రారంభించే చేవెళ్ల నుంచే తన పాదయాత్ర మొదలు కానున్నట్లు తెలిపారు. పాదయాత్ర ద్వారా పార్టీ బోలోపేతం చేసే దిశగా వెళ్లనున్నట్లు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు అమ్ముడుపోయాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాలన ఎండగడుతూ ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వెళ్లనున్నారు. నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం చేసే దీక్ష పాదయాత్రలోనే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపే కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేయనున్నట్లు చెబుతున్నారు. పాదయాత్ర అధికారం చేజిక్కించుకునే క్రమంలో ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించి అధికారం చేపట్టిన నేపథ్యంలో తాను సైతం అక్కడి నుంచే కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు. జీహెచ్ఎంసీ మినహారాష్ర్టంలోని అన్ని జిల్లాలను కలుపుకుంటూ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న షర్మిల ప్రస్తుతం దూకుడు పెంచేందుకు నిర్ణయించుకున్నారు. ప్రజలను తమ వైపు తప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు.

అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏఢాది పాటు దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్లు తిరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రజల ఆశలు నెరవేర్చే క్రమంలో పార్టీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారమే ఎజెండాగా పార్టీని ముందుకు తీసుకుపోవడానికి పలు ప్రణాళికలు రచిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికలకు పార్టీని అన్ని విధాలుగా సంసిద్ధం చేసే పనిలో పడిపోయారు.