https://oktelugu.com/

ఖబడ్దార్ వెధవల్లారా? సీఎం జగన్ సోషల్ సైన్యంపై ఎంపీ రఘురామ ఫైర్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ గుండె ఆపరేషన్ చేయించుకుంటే.. ఆయన పరిస్థితి విషమం.. ఇక అంతే అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ‘ఎంపీ రఘురామ సీరియస్’ అంటూ వైసీపీ ఫ్యాన్స్ హోరెత్తించారు. కొందరు ఆయన ఫొటోకు దండ కూడా వేసి సోషల్ మీడియాలో ఆయన పరువును బజారు పాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామ బయటకొచ్చాడు.. అసలు తనకు అనారోగ్యం నిజమేనని రఘురామ ఒప్పుకున్నాడు. కానీ చచ్చిపోయేంతది కాదని వివరణ ఇచ్చాడు. నా గుండెలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2020 6:11 pm
    Follow us on

    mp raghuramaraju

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ గుండె ఆపరేషన్ చేయించుకుంటే.. ఆయన పరిస్థితి విషమం.. ఇక అంతే అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ‘ఎంపీ రఘురామ సీరియస్’ అంటూ వైసీపీ ఫ్యాన్స్ హోరెత్తించారు. కొందరు ఆయన ఫొటోకు దండ కూడా వేసి సోషల్ మీడియాలో ఆయన పరువును బజారు పాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామ బయటకొచ్చాడు..

    అసలు తనకు అనారోగ్యం నిజమేనని రఘురామ ఒప్పుకున్నాడు. కానీ చచ్చిపోయేంతది కాదని వివరణ ఇచ్చాడు. నా గుండెలో బ్లాక్ ఉన్నట్టు గుర్తించి ముందు జాగ్రత్తగా సర్జరీ చేశారని రఘురామ తెలిపారు. నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటానని.. మా పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ముంబైలో గుండెకు సంబంధించి బైపాస్ సర్జరీ చేసుకున్న రఘురామ అది విజయవంతమైందని ప్రకటించారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరుగుతుండడంపై రఘురామ నిప్పులు చెరిగారు.

    ఈ సందర్భంగా రఘురామ వైసీపీ సోషల్ మీడియాపై నిప్పులు చెరిగారు.. ‘‘మా వైసీపీ.. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం వాళ్లు పనికిమాలిన వెధవల్లా తయారయ్యారు.‘రఘురామకృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు’ అని తప్పుడు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఓ మహిళా నేత, మరో ముగ్గురు మగ నాయకుల ఫొటోలతో ఆ ఫేక్ న్యూస్ వ్యాప్తిలోకి వచ్చింది. అవి చూసి ఇంకొందరు నా గురించి వికారమైన కామెంట్లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. నిజం చెప్పాలంటే నాకు హార్ట్ ఎటాక్ రానేలేదు.’ అని వివరణ ఇచ్చారు.

    ఇలా వైసీపీలో అసమ్మతి రాజేసిన పాపానికి పాపం రఘురామను వైసీపీ బ్యాచ్ టార్గెట్ చేసింది. దీనికి దాదాపు 20 రోజుల తర్వాత కోలుకున్న రఘురామ తాజాగా కౌంటర్ ఇస్తూ ఎన్ కౌంటర్ చేశాడు.