https://oktelugu.com/

‘క్రాక్’కు మరింత లాభం.. ‘ఆహా’ అనిపించేలా?

కరోనా తర్వాత ఏ సినిమాకు రానంత బిజినెస్ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాకు వచ్చింది. ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు భోగట్టా.. కానీ ఇప్పుడు సినిమా అమ్మకం ధరలు చూశాక ‘క్రాక్’కు లాభాల పంట పండడం ఖాయంగా కనిపిస్తోంది. Also Read: మహేష్ బాబు పోసిన 1020వ ప్రాణం.. ‘క్రాక్’ సినిమాను ఆంధ్ర ఏరియాకు రూ.8కోట్లు, నైజాం రూ.6.30 కోట్లు, సీడెడ్ 2.70 కోట్లకు థియేటర్ హక్కులు ఇచ్చారు. నాన్ థియేటర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 16, 2021 / 09:26 PM IST
    Follow us on

    కరోనా తర్వాత ఏ సినిమాకు రానంత బిజినెస్ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాకు వచ్చింది. ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు భోగట్టా.. కానీ ఇప్పుడు సినిమా అమ్మకం ధరలు చూశాక ‘క్రాక్’కు లాభాల పంట పండడం ఖాయంగా కనిపిస్తోంది.

    Also Read: మహేష్ బాబు పోసిన 1020వ ప్రాణం..

    ‘క్రాక్’ సినిమాను ఆంధ్ర ఏరియాకు రూ.8కోట్లు, నైజాం రూ.6.30 కోట్లు, సీడెడ్ 2.70 కోట్లకు థియేటర్ హక్కులు ఇచ్చారు. నాన్ థియేటర్ హక్కుల్లో భాగంగా హిందీ డబ్బింగ్ 11 కోట్లు, డిజిటల్ కోట్లు, శాటిలైట్ 6 కోట్లు మా టీవీకి ఇచ్చినట్టు సమాచారం. ఇవే కాకుండా ఆడియో, బోర్డర్ ఏరియాల రైట్స్ మరికొంత వచ్చాయి.

    ఈ లెక్కలన్నీ చూస్తే 42 కోట్లకు పైగానే వసూళ్లు విడుదలకు ముందే వచ్చాయి. సినిమా కొంచెం ఆడినా ఇంకా లాభాలు ఖాయం. దీంతో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ‘క్రాక్’ తో హీరో రవితేజ, నిర్మాత ఠాగోర్ మధు లాభపడినట్టే లెక్క.

    Also Read: అఖిల్ కి సెట్ చేసింది సమంతానే !

    తాజాగా ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’ వారు కొనుగోలు చేశారన్న విషయం తెలిసింది. ఇదే యాప్ లో జనవరిలోనే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేస్తున్నారన్న వార్త వినిపిస్తోంది. జనవరి చివరిలో ఈ సినిమా స్ట్రీమింగ్ వెర్షన్ వచ్చేస్తుందని టాక్. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్