గ్రేటర్ లొల్లి మళ్లీ మొదలైంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇన్ని రోజులు అయినా కొత్త కార్యవర్గం ఏర్పడలేదు. ప్రమాణం చేయలేదు. హంగ్ రావడంతో ఏపార్టీకి మెజార్టీ లేక జీహెచ్ఎంసీలో కొత్త పాలకవర్గానికి బ్రేక్ పడింది. డిసెంబర్1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే మేయర్ ఎంపిక ఇప్పటివరకు జరగలేదు. ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుందని తాజాగా ఎన్నికల కమిషనర్ ప్రకటించారు.
Also Read: తెలుగు రాష్ట్రాలను వదలని కేంద్రం.. మళ్లీ ఏం చేసిందంటే?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా గెజిట్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10తో గ్రేటర్ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. వారి పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇక ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరుగనుంది.
గెలిచిన అభ్యర్థులను అధికారికంగా ఎన్నికల సంఘం గుర్తించింది. బీజేపీ నుంచి ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్ విడుదల చేశారు.
ఇక పోటీచేసిన అభ్యర్థులంతా ఎన్నికల్లో చేసిన ఖర్చును ఎన్నికల సంఘానికి అందించాలి. లేకపోతే భవిష్యత్తులో పోటీకి అనర్హులు అవుతారు.
Also Read: అగమ్యగోచరం: ‘గంటా’ దారెటు?
మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు 50 సీట్లకు అటూ ఇటూగా సాధించాయి. ఏ రెండు కలిస్తేనే మేయర్ పీఠం సాధ్యం. కానీ ఏ రెండు కలిసేలా లేవు. దీంతో మేయర్ పీఠం డోలాయమానంలో పడనుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్