వివాహం అనేది ఓ అందమైన అనుభూతి. జీవితంలో ఒక్కసారి జరిగే తంతుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పెళ్లి జరిగే సందర్భంలో సంప్రదాయాలు పాటిస్తూ ఆనందంగా అడుగులు వేస్తూ జీవితంపై వధూవరులు ఎన్నో కలలు కంటారు. కానీ ఓ యువకుడు కన్న కలలు కల్లలయ్యాయి. జీవితంలో ఎవరికి జరగని చిక్కు అతడికి ఎదురైంది.వివరాల్లోకి వెళితే కాన్పూర్ నివాసి అయిన యువకుడు శాస్ర్తినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28న సంప్రదాయ పద్ధతులతో వివాహం చేసుకున్నాడు. దీంతో భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు. వివాహం అనంతరం వధూవరులకు తొలిరేయి ఏర్పాటు చేశారు. అయితే వారి మధ్య ఎలాంటి చర్య జరగలేదు.
దీంతో వరుడు భార్యను గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు పరిశీలించి ఇటీవల ఆమెకు లింగ మార్పిడి జరిగిందని తేల్చారు. దీంతో ఇంకా జననాంగాలు ఏర్పడలేదని చెప్పడంతో పెళ్లికొడుకు ఖంగుతిన్నాడు. పెళ్లికి ముందు దాచిపెట్టినందుకు వారిపై వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమయ్యాడు.
తన భార్య లింగమార్పిడి చేయించుకున్న హిజ్రా అని తేలడంతో షాక్ కు గురయ్యాడు. అత్త, మామలు, భార్య వైద్యనివేదితతోపాటు ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతోపాటు అందరిపై కేసు నమోదు చేశామని ఇన్ స్పెక్టర్ చెప్పారు. నిజాలు దాచి మోసం చేసినందుకు వారిపై కేసు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.