https://oktelugu.com/

నిరుద్యోగులకు ఐఓసీఎల్ శుభవార్త.. రూ.లక్ష వేతనంతో ఉద్యోగాలు..?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కొన్ని రోజుల క్రితం ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఐఓసీఎల్ తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రేడ్ – 1, గ్రేడ్- 4 ఉద్యోగ ఖాళీలను ఐఓసీఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం 47 ఖాళీల భర్తీ కోసం ఐఓసీల్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. గ్రేడ్ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారు 23 వేల రూపాయల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2020 / 07:12 PM IST
    Follow us on


    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కొన్ని రోజుల క్రితం ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఐఓసీఎల్ తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రేడ్ – 1, గ్రేడ్- 4 ఉద్యోగ ఖాళీలను ఐఓసీఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం 47 ఖాళీల భర్తీ కోసం ఐఓసీల్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. గ్రేడ్ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారు 23 వేల రూపాయల నుంచి 78 వేల రూపాయల వరకు వేతనం పొందవచ్చు.

    Also Read: ఇంజనీరింగ్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే..?

    గ్రేడ్ 4 ఉద్యోగాలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అర్హత, అనుభవం ఆధారంగా వేతనంలో మార్పులు ఉంటాయి. https://plis.indianoilpipelines.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాల ద్వారా భారీ వేతనం పొందే అవకాశం ఉండటంతో ఉద్యోగాలకు పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం.

    Also Read: రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు.. రూ.60 వేల వేతనంతో..?

    పదో తరగతి, ఐటీఐ, మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమా, ఐటీఐతో పాటు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    కేవలం ఆన్ లైన్ లో మాత్రమే గ్రేడ్ 1, గ్రేడ్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉచితంగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.