
దేశంలో రోజురోజుకు ఏటీఎం కార్డుల వినియోగం పెరుగుతోంది. లావాదేవీలు జరపడానికి ఏటీఎం కార్డులు ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో ఖాతాదారులు ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎం కార్డులు మిస్ అవుతూ ఉంటాయి. ఏటీఎం కార్డులు మిస్ కావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎం కార్డ్ మిస్ అయితే సులువుగా బ్లాక్ చేసే అవకాశం కల్పిస్తోంది.
ఏటీఎం కార్డ్ ను బ్లాక్ చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పలు సందర్భాల్లో ఖాతాల్లోని నగదు మాయమయ్యే అవకాశం ఉంది. ఎస్బీఐ తాజాగా మరోసారి ఖాతాదారులు తమ ఏటీఎం కార్డును సులువుగా ఎలా బ్లాక్ చేయాలో తెలిపింది. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయడం ద్వారా సులువుగా బ్లాక్ చేయవచ్చని తెలిపింది.
1800 112211 నంబర్ కు లేదా 1800 235 3800 నంబర్లకు కాల్ చేసి సరైనా వివరాలను చెప్పి కార్డును సులువుగా బ్లాక్ చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్నవాళ్లు వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి సులువుగా కార్డును బ్లాక్ చేయవచ్చు. ఎస్బీఐ వెబ్ సైట్ లో ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకుని ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ ఏటీఎం కార్డ్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
ఆ తరువాత మిస్ అయిన ఏటీఎం కార్డును ఎంపిక చేసుకుని వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి కార్డును బ్లాక్ చేయవచ్చు. అనంతరం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే కొత్త కార్డుకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేసి సులువుగా ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు.