మంత్రి సోదరుడు బీజేపీలోకి.. ఎవరా మంత్రి..!

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆకర్ష్ మొదలైంది. దుబ్బాక.. గ్రేటర్లో ఎన్నికల్లో జోరుచూపించిన బీజేపీ అదే దూకుడును రాష్ట్రమంతటా చూపించాలని తహతహలాడుతోంది. దీనిలో భాగంగా త్వరలోనే జరుగబోయే వరంగల్.. ఖమ్మం ఎన్నికల దృష్ట్యా ఈ జిల్లాలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. Also Read: టీపీసీసీ చీఫ్ ఎవరో ముందే ఫిక్స్ అయిందా.. మరీ అభిప్రాయ సేకరణ సంగతెంటీ? గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి చాలామంది ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. సినీ నటి విజయశాంతి చేరికలతో […]

Written By: Neelambaram, Updated On : December 12, 2020 1:41 pm
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆకర్ష్ మొదలైంది. దుబ్బాక.. గ్రేటర్లో ఎన్నికల్లో జోరుచూపించిన బీజేపీ అదే దూకుడును రాష్ట్రమంతటా చూపించాలని తహతహలాడుతోంది. దీనిలో భాగంగా త్వరలోనే జరుగబోయే వరంగల్.. ఖమ్మం ఎన్నికల దృష్ట్యా ఈ జిల్లాలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: టీపీసీసీ చీఫ్ ఎవరో ముందే ఫిక్స్ అయిందా.. మరీ అభిప్రాయ సేకరణ సంగతెంటీ?

గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి చాలామంది ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. సినీ నటి విజయశాంతి చేరికలతో మొదలైన నేతల వలసల జోష్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్.. టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నేతలతో ఇప్పటికే బీజేపీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రస్తుతం తన అన్న దయాకర్ రావుతో కలిసి టీఆర్ఎస్ కొనసాగుతున్నాడు. దయాకర్ రావు టీడీపీ ఉన్నప్పటి నుంచి ప్రదీప్ రావు ఆయన వెంట నడుస్తున్నాడు.

దయాకర్ రావు టీఆర్ఎస్ చేరినపుడు కూడా ప్రదీప్ రావు అన్న వెంటే నడిచారు. మంత్రి సోదరుడైనప్పటికీ ఆయనకు వరంగల్ అర్బన్.. రూరల్ ఎమ్మెల్యేలతో నిత్యం యుద్ధమే నడుస్తోంది. ప్రదీప్ రావు తెలంగాణ నెక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా విషయంలో ఎమ్మెల్యేలు తరుచూ ప్రదీప్ రావును టార్గెట్ చేస్తుండటంతో ఆయన టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: కోదండరాం ఎందుకు సైలంట్ అయ్యారు.. బరిలో నిలిచేనా?

ప్రదీప్​రావుకు వరంగల్​ పశ్చిమ.. తూర్పు ఎమ్మెల్యేలతో పొసగడం లేదని టాక్ విన్పిస్తోది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి తమ్ముడు అనే కారణంతో ప్రదీప్ రావును టార్గెట్ చేయడంతోపాటు ఆయన అనుచరులపై కేసులు కూడా నమోదు చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ప్రదీప్ రావు వరంగల్​ తూర్పు సెగ్మెంట్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.

అయితే దీనిని ముందే పసిగట్టిన వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే ప్రదీప్​రావుపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నాడట. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ప్రదీప్ రావును బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు సీటు కేటాయిస్తే వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ నేతలు ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ప్రదీప్ రావు మంత్రి సోదరుడు కావడంతో ఎప్పుడైనా పార్టీకి వెన్నుపొటు పొడుస్తాడా? అని బీజేపీ ఆలోచిస్తున్నారట. అయితే ప్రదీప్ రావుకు స్పష్టమైన హామీ ఇవ్వకపోయిన పరిశీలిస్తామని బీజేపీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి సోదరుడు బీజేపీలో చేరనుండటంతో సదరు మంత్రికి పదవీ గండం తప్పదా? అనే చర్చ కూడా నడుస్తోంది.