భారత్ లో కరోనా కేసులు తగ్గడానికి కారణమిదే..?

భారత్ లో గడిచిన నెల రోజులుగా కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో 50,000కు పైగా కరోనా కేసులు నమోదు కాగా నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించినా తక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు వైద్యులు దేశంలో కరోనా కేసులు తగ్గడానికి గల అసలు కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. Also Read: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయా..? దేశంలో కరోనా […]

Written By: Navya, Updated On : December 12, 2020 11:56 am
Follow us on


భారత్ లో గడిచిన నెల రోజులుగా కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో 50,000కు పైగా కరోనా కేసులు నమోదు కాగా నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించినా తక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు వైద్యులు దేశంలో కరోనా కేసులు తగ్గడానికి గల అసలు కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు.

Also Read: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయా..?

దేశంలో కరోనా రోగుల సంఖ్య, కరోనా రోగుల కోసం కేటాయించిన బెడ్ల సంఖ్య కూడా అంతకంతకూ తగ్గుతోంది. వైద్య వర్గాలు ప్రజల్లో పూర్తిస్థాయిలో కాకపోయినా పాక్షికంగా సామూహిక రోగనిరోధక శక్తి వచ్చిందని.. ఆ రోగనిరోధక శక్తి కరోనా కేసులు తగ్గడానికి కారణమవుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రం పూర్తిస్థాయిలో వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని తెలుపుతున్నారు.

Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఈ ఐదు గ్రూపుల వారికే కరోనా ముప్పు..?

పలు దేశాల శాస్త్రవేత్తలు కరోనా సెకండ్ వేవ్ వస్తుందని, సెకండ్ వేవ్ లో మరింత ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం లేదని.. ప్రజల్లో రోగనిరోధక శక్తి వస్తే వైరస్ విజృంభించించినా ఆ వైరస్ మనుషులపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుపుతున్నారు. సీరో సర్వేలో గతంలో దాదాపు 7 కోట్ల మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తేలింది. అయితే నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు నగరాల్లోనే నమోదయ్యాయి.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్లే నగరాల్లో ఎక్కువ కేసులు నమోదు కాగా జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకినా దాదాపు 97 శాతం మందిలో లక్షణాలు కనిపించలేదని సమాచారం. కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తే అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.