https://oktelugu.com/

లైవ్ వీడియో: ఉగ్రఘాతుకం.. పోలీసులపై కాల్పులు

ఉగ్రవాది ఘాతుకానికి పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్ లో పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు అసువులు బాసారు. జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. బఘాట్ ప్రాంతంలో పోలీసులపై ఓ ముష్కరుడు బహిరంగంగా అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దుస్తుల్లో తుపాకీని దాచుకొని వచ్చిన ఉగ్రవాది అతి సమీపం నుంచి ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు సీసీటీవీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2021 / 05:09 PM IST
    Follow us on

    ఉగ్రవాది ఘాతుకానికి పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్ లో పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు అసువులు బాసారు.

    జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. బఘాట్ ప్రాంతంలో పోలీసులపై ఓ ముష్కరుడు బహిరంగంగా అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

    దుస్తుల్లో తుపాకీని దాచుకొని వచ్చిన ఉగ్రవాది అతి సమీపం నుంచి ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది.

    ఈ కాల్పుల్లో సోహైల్ అనే కానిస్టేబుల్ ఘటన స్తలంలోనే మృతి చెందగా.. మహ్మద్ యూసఫ్ అనే మరో కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

    కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం రోడ్డులో ఉగ్రవాది కాల్పులకు తెగబడడం కలకలం రేపింది. భద్రతా బలగాలు రంగ ప్రవేశం చేసి దుండగుడి కోసం గాలిస్తున్నాయి.

    అత్యంత భద్రత ఉండే దుర్గనాత్ లోని ఓ రెస్టారెంట్ లో బుధవారం కాల్పులకు పాల్పడ్డారు. తాజాగా మూడు రోజుల తర్వాత తాజాగా మరోసారి కాల్పులు జరిపారు. జమ్మూకశ్మీర్ లో 24 మంది సభ్యుల దౌత్యవేత్తల బృందం పర్యటన సందర్భంగా ఉగ్రవాదులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.

    https://twitter.com/TejinderSsodhi/status/1362677771709784068?s=20