https://oktelugu.com/

కేంద్రబడ్జెట్: రాహుల్ కు హెడ్డేక్.. మీమ్స్ వైరల్

సృజనశీలురు రెచ్చిపోయారు. కేంద్రబడ్జెట్ ను చీల్చి చెండాడారు. ఎన్నడూ లేనంతా ఈ బడ్జెట్ కరోనా కల్లోలంలో సామాన్యులకు ఊరట కల్పించలేదని.. పెట్రోల్, డీజీల్ వాత పెట్టారని.. ఆదాయపు పన్ను పరిమితిని పెంచలేదని నిరసిస్తూ ఉద్యోగులు, నెటిజన్లు కేంద్రబడ్జెట్ పై మీమ్స్ సృష్టించి కేంద్రంలోని బీజేపీని ఓ ఆట ఆడుకున్నారు. రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్ కు హాజరైన ఫొటోలను తాజాగా ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ముఖంలోని ఎక్స్ ప్రెషన్స్ ను కట్ చేసి కేంద్రమంత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 1, 2021 / 07:55 PM IST
    Follow us on

    సృజనశీలురు రెచ్చిపోయారు. కేంద్రబడ్జెట్ ను చీల్చి చెండాడారు. ఎన్నడూ లేనంతా ఈ బడ్జెట్ కరోనా కల్లోలంలో సామాన్యులకు ఊరట కల్పించలేదని.. పెట్రోల్, డీజీల్ వాత పెట్టారని.. ఆదాయపు పన్ను పరిమితిని పెంచలేదని నిరసిస్తూ ఉద్యోగులు, నెటిజన్లు కేంద్రబడ్జెట్ పై మీమ్స్ సృష్టించి కేంద్రంలోని బీజేపీని ఓ ఆట ఆడుకున్నారు.

    రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్ కు హాజరైన ఫొటోలను తాజాగా ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ముఖంలోని ఎక్స్ ప్రెషన్స్ ను కట్ చేసి కేంద్రమంత్రి నిర్మల బడ్జెట్ విని రాహుల్ గాంధీకి హెడ్డేక్ వచ్చిందని మీమ్స్ తయారు చేశారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

    ఇక కేంద్రబడ్జెట్ ను నెటిజన్లు ఎండగడుతున్నారు. బడ్జెట్ 2021 హ్యాష్ ట్యాగ్ తో మీమ్స్ చేస్తూ తీవ్రంగా దుయ్యబడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమా సీన్లను కట్ చేసి కేంద్రబడ్జెట్ సామాన్యులకు ఏమాత్రం ఊరటనివ్వలేదని మీమ్స్ తో నిరసన తెలుపుతున్నారు.

    రాహుల్ గాందీ బయలజీ క్లాసులో ఉన్నప్పుడు ఈ బడ్జెట్ లెక్కల క్లాసులో ఉన్నప్పటి ఫొటోలను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బడ్జెట్ ను తమ సృజనాత్మకతతో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.