భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ 2021లో చేసిన సంస్కరణల వల్ల బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే బంగారం ధర భారీగా పతనం కావడం గమనార్హం. నేడు బంగారం ధర ఏకంగా 1,324 రూపాయలు పతనమైంది. ఈ మధ్య కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. బంగారం ధర తగ్గినా వెండి […]

Written By: Navya, Updated On : February 1, 2021 8:15 pm
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ 2021లో చేసిన సంస్కరణల వల్ల బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే బంగారం ధర భారీగా పతనం కావడం గమనార్హం. నేడు బంగారం ధర ఏకంగా 1,324 రూపాయలు పతనమైంది. ఈ మధ్య కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. బంగారం ధర తగ్గినా వెండి ధర మాత్రం పెరగడం గమనార్హం.

బంగారం ధర భారీగా పతనం కావడంతో 10 గ్రాముల బంగారం ధర 47,520 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర మాత్రం ఏకంగా 3,461 రూపాయల పెరుగుదలతో 72,470 రూపాయలకు పెరగడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకం తగ్గించడంతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు బంగారం కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.

కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరం జులైలో బంగారం, వెండి లాంటి లోహాలపై 10 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతానికి పెంచడంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు చేరువలో ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు బంగారం కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్రం బడ్జెట్ లో సుంకాన్ని హేతుబద్ధీకరిస్తామని వెల్లడించింది.

బంగారం, వెండి ధరలు తగ్గితే ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పసిడి ధరల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బంగారం ప్రియులు ప్రశంసిస్తున్నారు.