గొప్పతనంలో మెగాస్టార్.. మె..గా..స్టా..రే ?

గత ఐదు నెలలు నుండి కరోనా మహమ్మారితో తీవ్ర సంక్షోభం.. నిస్సహాయతలో కొట్టుమిట్టాడుతున్న సినీ కార్మికుల ఆర్ధిక ఇబ్బందులు.. అతలాకుతలం అయిపోతున్నా జీవితాలు.. వీరందరికీ దేవుడు ఇప్పుడు మెగాస్టార్ మాత్రమే. సినిమా జనం పస్తులు పడకుండా వారి ఆకలి కన్నీళ్లు తుడుస్తున్నాడు మెగాస్టార్. కడుపు ఆకలి గోల గురించి కృష్ణా నగర్ లో కథలు కథలుగా వినిపించాల్సిన ట్రాజెడీ కథలకు.. మెగాస్టార్ హ్యాపీ ఎండింగ్ ఇస్తున్నారు. ఆపదలో ఆదుకుని గుప్పెడు సాయం చేసేవాడే దేవుడు అయితే, మెగాస్టార్ […]

Written By: admin, Updated On : August 20, 2020 12:37 pm
Follow us on


గత ఐదు నెలలు నుండి కరోనా మహమ్మారితో తీవ్ర సంక్షోభం.. నిస్సహాయతలో కొట్టుమిట్టాడుతున్న సినీ కార్మికుల ఆర్ధిక ఇబ్బందులు.. అతలాకుతలం అయిపోతున్నా జీవితాలు.. వీరందరికీ దేవుడు ఇప్పుడు మెగాస్టార్ మాత్రమే. సినిమా జనం పస్తులు పడకుండా వారి ఆకలి కన్నీళ్లు తుడుస్తున్నాడు మెగాస్టార్. కడుపు ఆకలి గోల గురించి కృష్ణా నగర్ లో కథలు కథలుగా వినిపించాల్సిన ట్రాజెడీ కథలకు.. మెగాస్టార్ హ్యాపీ ఎండింగ్ ఇస్తున్నారు. ఆపదలో ఆదుకుని గుప్పెడు సాయం చేసేవాడే దేవుడు అయితే, మెగాస్టార్ దేవుడే. ఒక పూట భోజనం పెడితేనే గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అయ్యే జనం ఉన్న ఈ రోజుల్లో దాదాపు నాలుగు నెలలు నుండి సుమారు 11 వేలమందికి ఆకలి తీరుస్తున్నాడు మెగాస్టార్.

Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

కరోనా నుండి తెలుగు సినీ కార్మికులకు ఉపశమనం కలిగించడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పెట్టారు మెగాస్టార్. ఇప్పటికే రెండు సార్లు సరుకులు ఇచ్చిన మెగాస్టార్, ఈ రోజు మళ్ళీ మూడోసారి కూడా కార్మికులకు సరుకులను పంపణి చేస్తున్నారు. కష్టకాలంలో ఆయన చేస్తున్న ఈ సేవకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఈ విషయంలో మెగాస్టార్ కి సినీ కార్మికులు జీవితాంతం రుణపడి ఉంటారు. అలాగే ఫండ్స్ ఇచ్చిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బన్నీ, బాలయ్య, ప్రభాస్, నాగార్జున, నారా రోహిత్, కార్తికేయ, కొరటాల శివ, వినాయక్ , విశ్వక్ సేన్ లాంటి ప్రముఖులను కూడా ప్రత్యేకంగా అభినందించి తీరాలి.

Also Read: గాన గంధర్వుడి ఆరోగ్యం అత్యంత విషమం !

సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎప్పుడూ ఒక్కటిగా ఉండరు అంటారు, నిజమే కావొచ్చు.. కానీ.. జనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అందరూ ఒక్కటై సాయం చేయడం అభినందనీయం. మెగాస్టార్ సార‌థ్యంలో నడుస్తోన్న ఈ క‌రోనా క్రైసిస్ చారిటీ కష్టాల్లో ఉన్న సినీకార్మికుల్ని గుర్తించి ఇలాగే ఆదుకోవాలని ఆశిద్దాం. అయితే ఏ క్రాఫ్ట్ లో మెంబర్ కాని వేల మంది సినీ కార్మికులకు మొదటి నుండి ఎలాంటి సాయం అందట్లేదనే విషయం, ఇప్పటికే వీరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనే విషయం మెగాస్టార్ కి చేరాలి. వీరికి కూడా మెగాస్టార్ నుండి సాయం అందాలని కోరుకుందాం.