“చంద్రబాబు ని ఎందుకు బిజెపి ఏమీ అనకూడదు…?” ఈ ఏడుపు ఎవరిది?

ఇప్పటివరకూ ఏపీ బీజేపీ సోము వీర్రాజు నూతన అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే చాలామంది అధికారపక్షాన్ని ప్రశ్నించడం మానేసి ప్రతిపక్షం పై వీరి అజమాయిషీ ఏంటి అని…. ఎన్నో స్టేట్మెంట్ లు ఇవ్వటం మొదలు పెట్టారు. అయితే వాటన్నింటికి ఇప్పుడు నేరుగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఇప్పటి వరకూ చంద్రబాబు డైరెక్షన్ లోనే అంతా సాగిందని…. ముందుగా అంతటి మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ ను […]

Written By: Kusuma Aggunna, Updated On : August 18, 2020 1:13 pm
Follow us on

ఇప్పటివరకూ ఏపీ బీజేపీ సోము వీర్రాజు నూతన అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే చాలామంది అధికారపక్షాన్ని ప్రశ్నించడం మానేసి ప్రతిపక్షం పై వీరి అజమాయిషీ ఏంటి అని…. ఎన్నో స్టేట్మెంట్ లు ఇవ్వటం మొదలు పెట్టారు. అయితే వాటన్నింటికి ఇప్పుడు నేరుగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సమాధానం ఇచ్చారు.

రాష్ట్రం ఇప్పటి వరకూ చంద్రబాబు డైరెక్షన్ లోనే అంతా సాగిందని…. ముందుగా అంతటి మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ ను మోసం చేసి తెలుగుదేశం పార్టీకి తన ముఖచిత్రాన్ని అంటించుకున్న చంద్రబాబు ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేత ఒక పత్రిక, ఒక మీడియా సంస్థను పెట్టించే స్థితి దాకా తీసుకుని వచ్చారని…. అలాంటి బాబుని తాము ఎందుకు ఏమీ అనకూడదు…? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే అవకాశవాద రాజకీయాలు…. ఈ మాటలు వింటున్న వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన వీర్రాజు…. 2004లో తమతో కూటమికి సముఖత చూపించిన వారు 2014లో కేంద్రంలో తాము బలపడగా…. అప్పుడు వారే ఎగబడి తమతో జతకట్టేందుకు వచ్చారని ఆయన స్పష్టం చేశారు.

బాబుకి ఉగ్గుపాలతోనే అబద్ధాలను పట్టారని…. వాటన్నింటికీ మనం రోజులు  ఇన్ని ‘ఊ’ కొడుతూ ఉన్నామని చురకలు అంటించారు. 2014 లో మా కారణంగా గెలిచి ఆ తర్వాత సోనియా, రాహుల్ భుజాన చేతులు వేసిన చంద్రబాబు ఎంతో నిస్సిగ్గుగా మళ్లీ బీజేపీ తో కలవడానికి ప్రయత్నించడం ఏమిటని…. అటువంటి వ్యక్తిని విమర్శించడం ఎలా తప్పు అవుతుందని వీర్రాజు అడిగారు. ఇక చాలామంది బిజెపి చివరికి ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు అయినా తప్పక చంద్రబాబు తో కలుస్తుంది అన్న మాటలకి చివరికు జరిగేది ఏమిటో చూసేందుకు శాంతంగా వేచి ఉండాలని హితవు పలికారు.

అలాగే గతంలో కూడా బిజేపి కి వాజ్ పయ్ ద్వారా కేంద్రంలో మంచి ఓటు బ్యాంకు వచ్చిన తర్వాతే.. బాబు తమతో జత కట్టాడు అని…. అందుకు ముందు, ఆ తర్వాత బాబు సందర్భానుసారంగా ప్లేటు మార్చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. ఇక ఇలా ప్రతిసారి వారు తమ అవసరం కోరుకోవడమే తప్పించి…. తమకు వారి అవసరం ఏమీ లేదని స్పష్టం చేసి బాబు చేసే ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలను తిప్పికొట్టడం తప్పు అని అనడం ఏమిటో తనకు అర్థం కావడం తన వాదనను ముగించారు.