దేశంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. కరోనా కేసులు తగ్గినా ఫెనోఫైబ్రేట్ ఔషధంతో మాత్రమే కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. యూకేలోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఫెనోఫిబ్రిక్ యాసిడ్ కరోనా సంక్రమణను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ లో కూడా ఈ విషయం వెల్లడి కావడం గమనార్హం.
సాధారణంగా ఫెనోఫైబరేట్ ను రక్తంలో లిపిడ్లను నియంత్రించడంతో పాటు కొలెస్ట్రాల్ ను నియంత్రించడం కొరకు వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సులువుగా తక్కువ ధరకే ఈ ఔషధం లభిస్తుంది. ప్రస్తుతం అధిక కొలెస్ట్రాల్ తో బాధ పడుతున్న రోగులు ఈ మందును వినియోగిస్తున్నారు. ఫెనోఫైబరేట్ అనే మందు తీవ్ర ఇన్ఫెక్షన్ ను నిరోధించే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటుంది.
కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా చేయడంలో ఈ మందు తోడ్పడుతుంది ఈ ఔషధం కరోనా వ్యాక్సిన్ కు ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. హైపర్ రోగనిరోధక రుగ్మతలతో బాధ పడేవాళ్లకు ఈ మందు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని ఈ ఔషధం 70 శాతం వరకు తగ్గిస్తుందని తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగులపై ఈ ఔషధాన్ని శాస్త్రవేత్తలు పరిక్షించారు.
ప్రస్తుతం మన దేశంలో కరోనా డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంట్ వల్ల ప్రజలు సైతం భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫెనోఫైబ్రేట్ అనే మందును డెల్టా వేరియంట్ పై వినియోగిస్తూ పరిశోధనలు చేస్తుండగా త్వరలో ఈ ప్రయోగానికి సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి.