మాస్టర్ టీజర్ రిలీజ్: విజయ్ వర్సెస్ విజయ్..!

ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. దీపావళి సందర్భంగా విడుదలైన మాస్టర్ టీజర్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ కు పోటీగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా తాజాగా రిలీజైన మాస్టర్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. Also Read: దీపావళి టపాసులతో బండ్ల గణేష్.. నెటిజన్ల కౌంటర్..! తమిళ హీరో […]

Written By: NARESH, Updated On : November 15, 2020 11:42 am
Follow us on

ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. దీపావళి సందర్భంగా విడుదలైన మాస్టర్ టీజర్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ కు పోటీగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా తాజాగా రిలీజైన మాస్టర్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Also Read: దీపావళి టపాసులతో బండ్ల గణేష్.. నెటిజన్ల కౌంటర్..!

తమిళ హీరో కార్తీతో ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘మాస్టర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. విజయ్ కు జోడీగా మాళవికా మోహనన్ నటిస్తోంది. అర్జున్ దాస్.. సిమ్రన్.. భాగ్యరాజ్.. ఆండ్రియా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మాస్టర్’ మూవీ కరోనా కారణంగా రిలీజుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది.

Also Read: ‘ఆదిపురుష్’లో ప్రభాస్ జోడీగా ఎవరంటే?

‘మాస్టర్’ మూవీపై ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో కొద్దిరోజులుగా విజయ్ ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు. తాజాగా దీపావళిని పురస్కరించుకొని ‘మాస్టర్’ చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘నాకు తెలుసు సర్.. జేడీ ఒక నేరస్థుడు. అయినా.. ఒక సాధారణ ప్రొఫెసర్ ఇంత డేంజరస్ వ్యక్తిలా ఎందుకు మారాడు?’ అనే డైలాగుతో టీజర్ ప్రారంభమైంది. స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ తో మంచి ఫైట్ సీన్లను ఎలివేట్ చేస్తూ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

మాస్టర్ టీజర్లో విజయ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. తనదైన మ్యానరిజం.. ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతి రఫ్ అండ్ టఫ్ లుక్కులో విలన్ గా అదరగొట్టాడు. విజయ్ వర్సెస్ విజయ్ సేతుపతి అన్నట్లు సాగిన కొన్ని సీన్స్ హైలెట్ గా నిలిచాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మరింత ప్లస్ కానుంది. మొత్తానికి ‘మాస్టర్’ టీజర్ విజయ్ అభిమానుల మోముల్లో దీపావళి వెలుగులను నింపింది.