https://oktelugu.com/

తెలంగాణలో ఆస్తిపన్ను 50 రాయితీ ఉత్తర్వులు జారీ

2020-21 సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఉంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిన్న చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15 వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం, మిగిలిన పట్టణాల్లో రూ.10 వేల వరకు, ఇంటి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లంచి […]

Written By: , Updated On : November 15, 2020 / 11:03 AM IST
Follow us on


2020-21 సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఉంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిన్న చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15 వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం, మిగిలిన పట్టణాల్లో రూ.10 వేల వరకు, ఇంటి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లంచి వారికి వచ్చే ఏడాది చెల్లించే మొత్తంలో మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 31.40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు.