దుబ్బాకలో భారీ పోలింగ్: ఎవరికి దెబ్బ?
తెలంగాణలోని దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక ఫలితంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణించడంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మంగళవారం ఈ స్థానానికి పోలింగ్ జరిగింది. ముందుగా ఈ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవానికి యత్నించింది. కానీ సాధ్యం కాకపోవడంతో మళ్లీ మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చి బరిలో నింపింది టీఆర్ఎస్. దీంతో ఇక్కడ గెలుపు సునాయసమే అనుకున్న అధికార పార్టీ టీఆర్ఎస్ కు రాను రాను […]
Written By:
NARESH, Updated On : November 4, 2020 4:52 pm
తెలంగాణలోని దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక ఫలితంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణించడంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మంగళవారం ఈ స్థానానికి పోలింగ్ జరిగింది. ముందుగా ఈ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవానికి యత్నించింది. కానీ సాధ్యం కాకపోవడంతో మళ్లీ మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చి బరిలో నింపింది టీఆర్ఎస్. దీంతో ఇక్కడ గెలుపు సునాయసమే అనుకున్న అధికార పార్టీ టీఆర్ఎస్ కు రాను రాను ప్రతిపక్షాల నుంచి పోటీ తీవ్రమైంది.ఈ నియోజకవర్గ బరిలో టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి. నోటిఫికేషన్ ప్రకటించిన తరువాత టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యే ప్రధాన పోటీ అనుకున్నారు. కానీ బీజేపీ నుంచి పోటీలో ఉన్న రఘునందన్ రావు సానుభూతిని వ్యక్తపరచడంతో టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా..? నేనా..? అన్నట్లు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉద్రుతంగా ప్రచారం చేశారు. అటు టీఆర్ఎస్ పార్టీ తరుపున మంత్రి హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించడంతో తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
దుబ్బాక నియోజకవర్గంలో మంగళవారం జరిగిన పోలింగ్ ను పరిశీలిస్తే ఓటర్లు భారీగా తరలివచ్చారు. 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కరోనా నేథప్యంలో ఓటింగ్ శాతం తగ్గుతుందని అందరూ భావించారు. కాని గత ఎన్నికల మాదిరిగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇక కరోనాతో బాధపడుతున్న వారు సైతం పీపీఈ కిట్లు వేసుకొని ఓటేశారు. అధికార యంత్రాంగం సైతం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
Also Read: దుబ్బాక: నాటి ఫలితాలే పునరావృతం అవుతాయా..!
సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకే కలిసివస్తాయి. నిన్న జరిగి ఎన్నికలోనూ తమదే విజయం అంటూ టీఆర్ఎస్ చెబుతోంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు రైతు పక్షపాతిగా కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్ష బీజేపీ సైతం టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలను ఆలోచింపజేసింది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కువగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు పడుతాయని ప్రచారం జరిగింది. అయితే ఓటింగ్ శాతంతో అధికార పార్టీ గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఎవరూ ఊహించని విధంగా దుబ్బాక ఎన్నిక ప్రక్రియ జరగడం రాజకీయంలో కొత్త పరిణామం..