
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతుంది. వివిధ విభాగాల్లో భారత ఆటగాళ్లు చూపుతున్న ప్రతిభకు వరుసగా పతకాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా భారత్ షట్లర్ మనోజ్ సర్కార్ కాంస్య పతకం కోసం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ పోరులో అద్భుత విజయం సాధించి మెడల్ దక్కించుకున్నాడు. పారాలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 17 పతకాలు సాధించింది.