https://oktelugu.com/

ఆ హీరోని వదలను అంటున్న ఆంటీ !

కొన్ని బంధాలు మరీ విచిత్రంగా ఉంటాయి. పైగా పెళ్లి అయిపోయి ఎదిగిన పిల్లలు ఉన్న ఓ ఇల్లాలు ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడటం, అతని కోసం కుటుంబాన్నే వదిలిపెట్టడం అంటే.. చలంగారి నవలలు గుర్తుకువస్తున్నాయి. రాజభవనంలో కూర్చోబెడితే, వీధిలోని పరిసరాల పైనే ఎక్కువ మక్కువ చూపిస్తే ఎవ్వరు మాత్రం ఏమి చేయగలరు. బాలీవుడ్ ముదురు హీరోయిన్ ‘మలైకా అరోరా’ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. నిజానికి ఆమెకు దక్కిన అదృష్టం మరో ఏ ఐటమ్ భామకు […]

Written By:
  • admin
  • , Updated On : April 3, 2021 / 11:26 AM IST
    Follow us on


    కొన్ని బంధాలు మరీ విచిత్రంగా ఉంటాయి. పైగా పెళ్లి అయిపోయి ఎదిగిన పిల్లలు ఉన్న ఓ ఇల్లాలు ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడటం, అతని కోసం కుటుంబాన్నే వదిలిపెట్టడం అంటే.. చలంగారి నవలలు గుర్తుకువస్తున్నాయి. రాజభవనంలో కూర్చోబెడితే, వీధిలోని పరిసరాల పైనే ఎక్కువ మక్కువ చూపిస్తే ఎవ్వరు మాత్రం ఏమి చేయగలరు. బాలీవుడ్ ముదురు హీరోయిన్ ‘మలైకా అరోరా’ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది.

    నిజానికి ఆమెకు దక్కిన అదృష్టం మరో ఏ ఐటమ్ భామకు దక్కలేదు. ఐటమ్ సాంగ్స్ చేసుకునే మలైకాకి కాలం కలిసి వచ్చి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి కోడలు అయింది. పెద్ద ఇంటికి కోడలు అయినా ఈ ముదురు భామ మాత్రం ఎప్పుడెప్పుడు ఎక్స్ పోజ్ చేద్దామా అన్నట్టు ఎప్పుడూ రెడీగా ఉండేది. అయినా సల్మాన్ కుటుంబం అన్ని ఆమె ఇష్టానికే వదిలేసారు. కానీ మధ్యలో అర్జున్ కపూర్ తో రొమాన్స్ కి అలవాటు పడి చివరికీ సల్మాన్ తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి మరీ, అర్జున్ కపూర్ ను పెళ్లి చేసుకుంటాను అంటుంది ఈ ఆంటీ.

    మొత్తానికి వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నా.. వీరు మాత్రం తమ ప్రేమలోనే మునిగితేలుతున్నారు. అయితే త్వరలోనే వీరి ప్రేమ ఓ కొలిక్కి రానుందని తెలుస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటి కానున్నారని.. పెళ్లి కూడా సమ్మర్ తర్వాత ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి వీరి వివాహ వేడుకకు సల్మాన్ కుటుంబం నుండి ఎవరైనా వస్తారా ? కనీసం మలైకా పిల్లలు అయినా వస్తారా ? చూడాలి. ఇక బోనీ కపూర్ మాత్రం తన తనయుడి వ్యవహారంతో నలిగిపోతున్నాడు అని తెలుస్తోంది.