
అమ్మాయిల కలల రాకుమారుడు మహేష్ బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. దేశవ్యాప్తంగా మహేష్ అంత అందం చందం ఉన్న హీరో మరొకరు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అందగాడు పాపం ఎడారిలో కష్టపడుతున్నాడు. ఎండకు అలసిసొలసి మళ్లీ జిమ్ లోనూ తెగ కష్టపడుతున్నాడు.
Also Read: రివ్యూః కపటధారి
ప్రస్తుతం మహేష్ బాబు దుబాయ్ లో ఉన్నాడు. ఆయనతోపాటు ఫ్యామిలీ కూడా ఉంది. కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేస్తున్నారు. యాక్షన్ సీన్లలో పాల్గొంటున్నాడు. వీటితోపాటు ఈ సినిమాలో కండలు తిరిగిన హీరో అవసరం కావడంతో పగలు ఎండల్లో షూటింగ్ చేస్తూ అలసిసొలసి సాయంత్రం పూట జిమ్ లో గంటల తరబడి తన కండలు కరిగించేస్తున్నాడట..
యాక్షన్ సన్నివేశాల కోసం మహేష్ బాబు దాదాపు 30 రోజులపాటు కష్టపడ్డాడు. అతడి కష్టం మామూలుగా లేదని.. మహేష్ ఫిట్ నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియాల్ తెలిపారు. అంతేకాదు మహేష్ బాబు కష్టపడుతున్న ఫొటోను ఆయన షేర్ చేశాడు.
Also Read: దుబాయ్ పోలీస్టేషన్ లో మహేష్ బాబు.. ఏం జరిగింది?
దుబాయ్ లో కష్టమైన జోన్ 2 ట్రైనింగ్ ను తీసుకొని మరీ సినిమా కోసం మహేష్ కష్టపడ్డాడని.. సినిమా బాగా రావడానికి మహేష్ పడిన కష్టం అంతా ఇంతాకాదని ఆ ట్రైనర్ వాపోయాడు. ఎడారిలో పగలు షూటింగ్, రాత్రి జిమ్ చేస్తూ మహేష్ పడిన కష్టాలను ఆయన ట్రైనర్ ఏకరువు పెట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.