‘సర్కారి వారి పాట’ ట్రైలర్ లో ఇదే హైలెట్!

టాలీవుడ్ లో అందానికే అందం.. మహేష్ బాబు.. అలాంటి మహేష్ బాబు అందంపై హీరోయిన్లే పాట పాడిస్తుంటారు. ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీలో అయితే హీరోయిన్ రష్మికమందన్న ఏకంగా మహేష్ అందంపై పాట పడి ఆడుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ను ఆయన తాజా చిత్రం ‘సర్కారి వారి పాట’లోనూ పెట్టారని అనిపిస్తోంది. హీరోయిన్ కీర్తి సురేష్ రాత్రి పడుకునే ముందు మహేష్ బాబుకు దిష్టి తీసే సన్నివేశం హైలెట్ అని చెప్పాలి. ‘సర్ పడుకునే ముందు ప్రతిరోజు […]

Written By: NARESH, Updated On : August 10, 2021 10:34 am
Follow us on

టాలీవుడ్ లో అందానికే అందం.. మహేష్ బాబు.. అలాంటి మహేష్ బాబు అందంపై హీరోయిన్లే పాట పాడిస్తుంటారు. ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీలో అయితే హీరోయిన్ రష్మికమందన్న ఏకంగా మహేష్ అందంపై పాట పడి ఆడుతుంది.

సేమ్ అదే కాన్సెప్ట్ ను ఆయన తాజా చిత్రం ‘సర్కారి వారి పాట’లోనూ పెట్టారని అనిపిస్తోంది. హీరోయిన్ కీర్తి సురేష్ రాత్రి పడుకునే ముందు మహేష్ బాబుకు దిష్టి తీసే సన్నివేశం హైలెట్ అని చెప్పాలి.

‘సర్ పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి’ అంటూ మహేష్ గ్లామర్ గురించి హీరోయిన్ కీర్తి సురేష్ చెప్పడం హైలెట్ అని చెప్పొచ్చు. మహేష్ లోని రోమాంటిక్ యాంగిల్ ను దర్శకుడు పరుశురాం మరోసారి వాడుకొని ఈ సినిమాలో చూపించాడని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు పక్కన వెన్నెల కిషోర్ ను కమెడియన్ గా ఈసారి నవ్వులు పూయించేలా డిజైన్ చేశారని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

ఇక మహేష్ అందాన్ని పొగిడేయడమే కాదు.. మహేష్ చేత కొన్ని నాటి రోమాంటిక్ డైలాగులను కూడా ఈ సినిమాలో చెప్పించారని తెలుస్తోంది. ‘ఏమోయ్.. కిషోర్.. ఓ ఐదారు మూరలు ఉండవవి’ అంటూ హీరోయిన్ జుట్టు, మల్లెపూలపై మహేష్ బాబు వేసే పంచ్ అదిరిపోయేలా ఉంది.

మొత్తంగా మహేష్ బాబు పుట్టిన రోజు కోసం దుబాయ్ ఏడారుల్లో తీసిన ఫైట్ సీన్లు, కొన్ని రోమాంటిక్ సీన్లను కలగలిపి విడుదల చేసిన ట్రైలర్ బ్లాస్టర్ గా ఉందని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పవర్ ప్యాక్డ్ బ్లాస్టర్ అంటున్నారు.

బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో అదరగొడుతున్నారు. లాంగ్ హెయిర్, మెడమీద ట్యాటూతోపాటు మెడలో ఓంకారం తో స్టైలిష్ గా మహేష్ కనిపిస్తున్నాడు.