మరో వారం రోజుల్లో జులై నెల రాబోతుందనే సంగతి తెలిసిందే. జులై నెల 1వ తేదీ నుంచే కొన్ని కొత్త నిబంధనలు సైతం అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల వల్ల పలు అంశాలు మారబోతున్నాయి. ఈ నిబంధనల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా ఏయే అంశాలు మారబోతున్నాయో సులభంగా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ రేటు మారుతుందనే సంగతి తెలిసిందే.
కొన్నిసార్లు ఎల్పీజీ సిలిండర్ రేటు స్థిరంగా కొనసాగినా ఎక్కువసార్లు సిలిండర్ రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. మరోవైపు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జులై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్ మారనుండగా బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయని తెలుస్తోంది.
ఎవరైతే ఇప్పటివరకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేదో వాళ్లు ఈ నెలలోపు ఆదాయపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆదాయపు పన్ను చెల్లించని పక్షంలో జూలై 1 నుంచి డబుల్ టీడీఎస్ ను చెల్లించాల్సి ఉంటుంది. సిండికేట్ బ్యాంక్ కస్టమర్లకు వచ్చే నెల నుంచి పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు పని చేసే అవకాశం ఉండదు. అందువల్ల వాళ్లు కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌డీ కోడ్లు వినియోగించాల్సి ఉంటుంది.
ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు తప్పుగా ఎంటర్ చేస్తే ఖాతాల్లో డబ్బు జమ చేయడం సాధ్యం కాదు. మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్ వంటి కంపెనీలు ఇప్పటికే కార్ల ధరలను పెంచుతున్నామని ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి ఈ కంపెనీల కార్ల ధరలు పెరగనుండగా కొత్తగా కార్లను కొనుగోలు చేసేవాళ్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.