https://oktelugu.com/

లవ్ స్టోరీ టీజర్ టాక్: నిరుద్యోగ ప్రేమ కంచికి చేరిందా?

అందమైన ప్రేమలను.. కల్మషం లేని మనసులను.. పచ్చకోక తొడిగే పల్లెలను చూడాలంటే అది శేఖర్ కమ్ముల చిత్రాల్లోనే సాధ్యం. తెలంగాణ యాస, భాషలను వినసొంపుగా వాడుకునే శేఖర్ దర్శకత్వ శైలి విభిన్నం. సున్నితమైన ప్రేమకథలకు పెట్టింది పేరైన శేఖర్ కమ్ముల నుంచి తాజాగా ఓ నిరుద్యోగ ప్రేమ కథ రాబోతోంది. Also Read: సోనూ సూద్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు..! ఫిదా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల మరోసారి మ్యాజిక్ చేస్తున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2021 / 11:27 AM IST
    Follow us on

    అందమైన ప్రేమలను.. కల్మషం లేని మనసులను.. పచ్చకోక తొడిగే పల్లెలను చూడాలంటే అది శేఖర్ కమ్ముల చిత్రాల్లోనే సాధ్యం. తెలంగాణ యాస, భాషలను వినసొంపుగా వాడుకునే శేఖర్ దర్శకత్వ శైలి విభిన్నం. సున్నితమైన ప్రేమకథలకు పెట్టింది పేరైన శేఖర్ కమ్ముల నుంచి తాజాగా ఓ నిరుద్యోగ ప్రేమ కథ రాబోతోంది.

    Also Read: సోనూ సూద్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు..!

    ఫిదా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల మరోసారి మ్యాజిక్ చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ‘లవ్ స్టోరీ’ని తెరకెక్కిస్తున్నారు. సాయిపల్లవిని ఇందులో సైతం నైజాం పోరీగా చూపించబోతున్నాడు. ఉద్యోగం సద్యోగం లేని నిరుద్యోగ యువకుడిగా నాగచైతన్యను చూపిస్తున్నారు. తెలంగాణ భాష భావోద్వేగంతో ఓ ప్రేమ కథను తీర్చిదిద్దారు.

    తాజాగా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో అద్భుతమైన హద్యమైన భావోద్వేగాలతో ప్రేమకథను చూపించాడు. లవ్ స్టోరీ.. కెరీర్ లో సెట్ కాకపోవడం.. మధ్యతరగతి జీవితాల్ని నిజ జీవితానికి దగ్గరగా చూపించాడు.

    Also Read: త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది – రామ్

    పెద్దలను ఎదురించి పారిపోయే నిరుద్యోగ జంటగా నాగచైతన్య-సాయిపల్లవి నటించారు. ఏంతో ఆవేదనగా సాయిపల్లవి ‘నన్ను వదిలేస్తావా?’ అన్న తెలంగాణ యాస డైలాగ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే కథను మాత్రం దర్శకుడు ఈ టీజర్ లో వెలువరించలేదు.

    అవిగోస్ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. రావు రమేశ్, పోసాని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్