https://oktelugu.com/

కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త.. రూ.80 వేల డిస్కౌంట్..?

కొత్త ఏడాదిలో కార్ల కంపెనీలు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో కొత్త కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కార్ల ధరలు పెరిగినప్పటికీ ఆఫర్లలో కార్లను కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు నిస్సాన్ కంపెనీ శుభవార్త చెప్పింది. Also Read: షియోమీ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు..? కొత్త కారును కొనుగోలు […]

Written By: , Updated On : January 10, 2021 / 11:17 AM IST
Follow us on

Car

కొత్త ఏడాదిలో కార్ల కంపెనీలు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో కొత్త కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కార్ల ధరలు పెరిగినప్పటికీ ఆఫర్లలో కార్లను కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు నిస్సాన్ కంపెనీ శుభవార్త చెప్పింది.

Also Read: షియోమీ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు..?

కొత్త కారును కొనుగోలు చేసిన వాళ్లకు ఏకంగా 80 వేల రూపాయల వరకు నిస్సాన్ కంపెనీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. 80 వేల రూపాయల డిస్కౌంట్ బెనిఫిట్స్ లో ఎక్స్ఛేంజ్ కింద 50 వేల రూపాయలు, క్యాష్ డిస్కౌంట్ లో భాగంగా 10,000 రూపాయలు, లాయల్టీ బెనిఫిట్ కింద 20,000 రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఆఫర్ ప్రారంభం కాగా ఈ నెల 31వ తేదీ వరకు 80 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను పొందవచ్చు.

Also Read: బంగారం కొనుగోలు చేసేవాళ్లకు గుడ్ న్యూస్.. ఆ డాక్యుమెంట్లు అక్కర్లేదట..?

ఎవరైతే నిస్సాన్ కిక్స్ కారును కొనుగోలు చేస్తారో వారు ఈ ఆఫర్ ద్వారా డిస్కౌంట్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. నివశించే ప్రాంతం, డీలర్ ను బట్టి 80 వేల డిస్కౌంట్ ఆఫర్ లో స్వల్పంగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. సమీపంలోని నిస్సాన్ కంపెనీ డీలర్ ను సంప్రదించి ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. పండగ సమయంలో కొత్తకారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

నిస్సాన్ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలు సైతం భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది కార్ల విక్రయాలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. వైరస్ ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో కార్ల విక్రయాలు పుంజుకున్నాయి.