
మొన్న టీడీపీ ఎమ్మెల్యే కం అగ్రహీరో బాలయ్య సొంత పార్టీ కార్యకర్త చెంప పగుల కొట్టాడు. ఈరోజు విజయనగరం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఏకంగా ఓ మహిళ వంగబెట్టి ఒక్కటి చరిచాడు. వీడియోలో అశోక్ గజపతి అడ్డంగా దొరకడంతో పెను దుమారం రేగింది. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అటు బాలయ్య, ఇటు అశోక్ గజపతి తీరుతో ఇప్పుడు టీడీపీ పరువు గంగలో కలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అశోక్ గజపతి రాజు విజయనగరంలో సోమవారం ప్రచారం చేపట్టారు. ప్రచారానికి వచ్చిన మహిళపై అకారణంగా చేయిచేసుకున్నట్టు ఓ వీడియో బయటకు వచ్చింది. అశోక్ గజపతిపై పువ్వులు జల్లుతుండగా సహనం కోల్పోయిన అశోక్ గజపతిరాజు సదురు మహిళా కార్యకర్త మెడలు వంచి చితకబాదినట్టు వీడియోలో ఉంది.
చుట్టూ పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఉండడం. అందరూ చూస్తుండగానే అశోక్ గజపతి ఈ దాడి చేయడంతో కార్యకర్త మౌనంగా రోదిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయిందట..
అశోక్ గజపతిరాజు ప్రవర్తనపై ఇప్పుడు సొంత టీడీపీ కార్యకర్తలు, నేతల నుంచే కాదు.. సోషల్ మీడియాలోనూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ పరిణామాలు టీడీపీకి నష్టం కలిగిస్తాయని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట..
https://twitter.com/Lokeshpaila/status/1368843091529015298?s=20