https://oktelugu.com/

ఏలూరు వ్యాధికి కారణమిదే.. తేల్చిన నిపుణులు.. ఇక జిల్లాకో ల్యాబ్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచక్కని వ్యాధికి కారణం తేలిపోయింది.. ఏం జరుగుతోందో.. ఎందుకు జరుగుతోందో అర్థం కాక.. తలపట్టుకున్న నిపుణులకు రీజన్ తెలిసిపోయింది. ప్రజలు ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడానికి పురుగు మందులే కారణమని నిపుణులు తేల్చారు. ఈ వింత వ్యాధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమీక్షలో ఢిల్లీ ఎయిమ్స్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ (ఎన్‌ఐసీటీ) సహా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 / 08:27 PM IST
    Follow us on


    పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచక్కని వ్యాధికి కారణం తేలిపోయింది.. ఏం జరుగుతోందో.. ఎందుకు జరుగుతోందో అర్థం కాక.. తలపట్టుకున్న నిపుణులకు రీజన్ తెలిసిపోయింది. ప్రజలు ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడానికి పురుగు మందులే కారణమని నిపుణులు తేల్చారు. ఈ వింత వ్యాధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమీక్షలో ఢిల్లీ ఎయిమ్స్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ (ఎన్‌ఐసీటీ) సహా ప్రముఖ పరిశోధనా సంస్థలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాయి.

    Also Read: అక్కడ పోటీలో కాషాయమేనా?

    ప్రజలు శరీరాల్లోకి పురుగు మందుల అవశేషాలు చేరాయని నిపుణులు తెలిపారు. అయితే.. అవి ఒంట్లోకి ఎలా ప్రవేశించాయన్న దానిపై అధ్యయనం అవసరమని సూచించారు. స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. ఈ విషయాన్ని తేల్చే బాధ్యతను ఢిల్లీ ఎయిమ్స్‌, ఎన్‌ఐసీటీకి అప్పగించారు. ఏలూరులో క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి, ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని కోరారు.

    Also Read: న్యాయవాదులకు ఇక చుక్కలే.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు

    ఇక, శాస్త్రవేత్తలు వెలువరించిన ఫలితాల ఆధారంగా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, దీనికి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని జగన్ ఆదేశించారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలన్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్