
ఈ మధ్య కాలంలో దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే పాలసీలను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీపై సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల్లో నమ్మకం, విశ్వాసం అంతకంతకూ పెరుగుతోంది. ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఎల్‌ఐసీ మంచి పాలసీలను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది.
Also Read: వ్యాక్సిన్ వచ్చినా.. అంతగా అవసరం ఉండదట!
ఎల్‌ఐసీ అందిస్తున్న అత్యుత్తమ పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ తీసుకున్న కస్టమర్లకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణంగా పాలసీ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై రాబడి మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. అయితే జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా కుటుంబానికి రాబడితో పాటు రక్షణ లభిస్తుంది. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఈ ప్లాన్ ను తీసుకోవచ్చు.
ఈ పాలసీని తీసుకున్న వాళ్లు 15 నుంచి 35 సంవత్సరాల కాలపరిమితితో ఎంచుకోవాల్సి ఉంటుంది. మన వయస్సును బట్టి కాలపరిమితి విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు 5 లక్షల రూపాయల పాలసీ తీసుకున్న వాళ్లకు 35 సంవత్సరాల తరువాత ఏకంగా 25 లక్షల రూపాయలు అందుతాయి. ఈ పాలసీ ద్వారా బీమా మొత్తంతో పాటు బోనస్, అడిషనల్ బోనస్ కూడా పొందవచ్చు.
Also Read: కరోనా విషయంలో శుభవార్త… వ్యాక్సిన్ అవసరమే లేదట..?
రోజుకు 40 రూపాయలు ఆదా చేసినా ఈ మొత్తం పొందడం సాధ్యమే. ఈ పాలసీపై 5 లక్షల రూపాయల బీమా కవరేజ్ ఉంటుంది. ఎల్‌ఐసీ బీమా ప్రయోజనాలను కూడా కల్పిస్తున్న నేపథ్యంలో జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్న కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు సైతం చేకూరుతాయి.