
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మనందరికీ తెలిసిందే. దేశంలోని మిగతా బీమా సంస్థలతో పోల్చి చూస్తే ప్రజలకు ఎల్‌ఐసీ అందించే పాలసీలు అత్యుత్తమంగా ఉంటాయి. ఎల్‌ఐసీ పాలసీలు అదిరిపోయే రాబడిని అందజేస్తాయి కాబట్టి చాలామంది ఈ పాలసీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఎల్‌ఐసీ అందించే ఒక పాలసీ రాబడితో పాటు ఇన్సూరెన్స్ కవరేజీని కూడా అందిస్తోంది.
ఆధార్ శిలా పాలసీ పేరుతో ఎల్‌ఐసీ కేవలం మహిళలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా అందుబాటులోకి తెచ్చిన ఈ పాలసీలో రోజుకు 29 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏకంగా 4 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కవరేజీ లభించే ఈ పాలసీలో 8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్లు చేరవచ్చు. ప్రీమియం డబ్బులను చెల్లించడానికి వేర్వేరు ఆప్షన్లు ఉంటాయి.
75 వేల రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు తీసుకునే ఈ పాలసీకి మెచ్యూరిటీ సమయాన్ని 10 నుంచి 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఎల్‌ఐసీ పాలసీలలో ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. ఉదాహరణకు మూడు లక్షల రూపాయలకు 31 ఏళ్ల వయస్సులో పాలసీ తీసుకుంటే సంవత్సరానికి 10,700 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
పాలసీదారుడు మరణిస్తే కుటుంబ సభ్యులు పాలసీని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాలసిదారుడు పాలసీ మెచ్యూరిటీ తరువాత కూడా జీవించి ఉంటే బీమా మొత్తంతో పాటు లాయల్టీని పొందే అవకాశం ఉంటుంది.