ఈ పంట పండిస్తే కోటీశ్వరులు కావచ్చు.. కిలోకి లక్ష ఆదాయం..?

మన దేశంలోని రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. రైతులకు పంటలకు పెట్టుబడులు పెరుగుతున్నా అదే స్థాయిలో ఆదాయం పెరగడం లేదు. దేశంలోని ప్రజలకు అన్నం పెడుతున్న అన్నదాత మూడు పూటలా కడుపు నిండా తినే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే కొంతమంది రైతులు కొత్త విధానాల ద్వారా పంటలను సాగు చేస్తూ లాభాలను పొందుతున్నారు. సేంద్రీయ పద్ధతితో పాటు ఆధునిక పద్ధతులలో సాగు చేస్తూ కళ్లు చెదిరే లాభాలు పొందుతున్నారు. Also Read: ఖాతాదారులకు అదిరిపోయే […]

Written By: Navya, Updated On : February 6, 2021 5:10 pm
Follow us on

మన దేశంలోని రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. రైతులకు పంటలకు పెట్టుబడులు పెరుగుతున్నా అదే స్థాయిలో ఆదాయం పెరగడం లేదు. దేశంలోని ప్రజలకు అన్నం పెడుతున్న అన్నదాత మూడు పూటలా కడుపు నిండా తినే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే కొంతమంది రైతులు కొత్త విధానాల ద్వారా పంటలను సాగు చేస్తూ లాభాలను పొందుతున్నారు. సేంద్రీయ పద్ధతితో పాటు ఆధునిక పద్ధతులలో సాగు చేస్తూ కళ్లు చెదిరే లాభాలు పొందుతున్నారు.

Also Read: ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఎస్బీఐ..?

బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక రైతు పండించే పంట కిలో లక్ష రూపాయలు పలుకుతోంది. కిలో లక్ష రూపాయలు పలుకుంతుందంటే ఆ రైతు ఏ స్థాయిలో సంపాదిస్తున్నాడో సులభంగానే అర్థమవుతుంది. మార్కెట్‌ను అధ్యయనం చేసి ఆ రైతు లాభాలను ఆర్జిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ లోని ఔరంగాబాద్ లో ఉన్న నవీనగర్‌ బ్లాక్‌ కరండిహ్‌ గ్రామానికి చెందిన ఆమ్రేష్ ఇంటర్ వరకు చదువుకుని పొలం పని చేయాలని అనుకున్నాడు.

Also Read: స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. పది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..?

ఆ తరువాత వ్యవసాయం ద్వారా విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని భావించేవాడు. తన పొలంలో పండించి విదేశాలకు ఎగుమతి చేసే పంటల గురించి అధ్యయనం చేశాడు. ప్రస్తుతం హాప్‌ షూట్స్‌ అనే పేరు ఉన్న మూలికల జాతి కూరగాయను ఆమ్రేష్ పండిస్తున్నాడు. మొదట్లో హాఫ్ షూట్స్ పంట వేసిన సమయంలో విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఆమ్రేష్ ను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

యాంటీ బయోటిక్స్‌ తయారీలో ఉపయోగించే ఈ మూలికల జాతి మొక్క కిలో లక్ష రూపాయలు పలుకుతుంది. టీబీ చికిత్సలో, బీర్ తయారీలో హాఫ్ షూట్స్ మొక్క యొక్క ఆకులు, పువ్వులు, కాయలను మందుల తయారీలో వినియోగిస్తారు. వారణాసిలోని ఇండియన్‌ వెజిటబుల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ లాల్‌ సూచనల మేరకు ఆమ్రేష్ ఈ పంటను పండిస్తున్నారని సమాచారం.