https://oktelugu.com/

ఓన్లీ స్టార్ హీరోలే కావాలంటే ఎలా ?

యంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’ నటనకు తెలుగు వెండితెర పై నీరాజనాలు అందేసరికి, ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమా వాళ్ళు ఈ హీరోయిన్ కోసం పరితపిస్తున్నారు. తమ సినిమాలో ఇలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఉంటే.. సినిమా మార్కెట్ కి ఈజీ అవుతుందని వారి ఆశ. అయితే, ఈ భామ మాత్రం పెద్ద సినిమాలను, అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాలను మాత్రమే ఒప్పుకుంటుంది. మా బ్యానర్ లో చిన్న హీరో సినిమా […]

Written By: , Updated On : May 16, 2021 / 03:57 PM IST
Follow us on

Krithi Shettyయంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’ నటనకు తెలుగు వెండితెర పై నీరాజనాలు అందేసరికి, ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమా వాళ్ళు ఈ హీరోయిన్ కోసం పరితపిస్తున్నారు. తమ సినిమాలో ఇలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఉంటే.. సినిమా మార్కెట్ కి ఈజీ అవుతుందని వారి ఆశ. అయితే, ఈ భామ మాత్రం పెద్ద సినిమాలను, అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాలను మాత్రమే ఒప్పుకుంటుంది.

మా బ్యానర్ లో చిన్న హీరో సినిమా ఒకటి ఉంది, నిన్నే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాం, నువ్వు తప్పకుండా చేయాలి, మంచి సినిమా అవుతుంది’ అని ఓ పెద్ద నిర్మాత ఈ మధ్య ఈ అమ్మడికి ఆఫర్ ఇచ్చాడు. అయితే, ఆ నిర్మాత కూడా షాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది ఈ బ్యూటీ. సింపుల్ గా డేట్స్ లేవు అనేసిందట. మళ్ళీ అదే నిర్మాత చేస్తోన్న మరో పెద్ద సినిమాకి మాత్రం డేట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చిందట.

పెద్ద నిర్మాతకే ఇలా చెబితే.. ఇక చిన్నాచితకా హీరోలకు నిర్మాతలకు ఈ బ్యూటీ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తోందో. ఏది ఏమైనా సినిమా చేసే ఉద్దేశ్యం లేకపోతే సింపుల్ గా డేట్స్ లేవు అని సైడ్ అయిపోతుందట. నిజానికి ఈ బ్యూటీ డేట్స్ లేవు అని చెప్పేంత బిజీగా లేదు. ప్రస్తుతం నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను, సుధీర్ బాబు – ఇంద్రగంటి మూవీని, అలాగే రామ్ -లింగుస్వామి సినిమాను మాత్రమే చేస్తోంది.

పైగా ‘శ్యామ్ సింగ రాయ్’లో ఈ బ్యూటీ షూటింగ్ పార్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇక మిగిలిన రెండు సినిమాలు కూడా ఈ భామకి సంబంధించిన షూటింగ్ పార్ట్ ఎప్పుడో చివరి దశకు వచ్చింది. అంటే డేట్స్ లేవు అని చెబుతుంది కేవలం చిన్న సినిమాలు, చిన్న హీరోలతో చేయడం ఇష్టం లేకనే. అయినా ఒక్క సినిమాతోనే స్టార్ హీరోలు కావాలంటే ఎలా బ్యూటీ ?