https://oktelugu.com/

హవ్వా.. బాలీవుడ్ కిడ్నాప్ సినిమా చూసి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ అట?

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సంచలనం.. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటోంది. ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. అయితే ఇంత పకడ్బందీగా సాగిన కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసేందుకు అఖిలప్రియ బ్యాచ్ ఆరునెలలుగా కసరత్తు చేసిందట.. ఇందుకోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2021 / 10:54 AM IST
    Follow us on

    సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సంచలనం.. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటోంది. ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. అయితే ఇంత పకడ్బందీగా సాగిన కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

    Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

    కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసేందుకు అఖిలప్రియ బ్యాచ్ ఆరునెలలుగా కసరత్తు చేసిందట.. ఇందుకోసం ఓ బాలీవుడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని సేమ్ అలానే కిడ్నాప్ స్కెచ్ గీసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

    హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘స్పెషల్ ఛబ్బీస్’ అనే సినిమా చూసే కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలిందట.. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ అతడి గ్యాంగ్ ఐటీ అధికారుల్లా వచ్చి దోచుకుంటారు. ఆ సన్నివేశాలు చూసే ఐటీ ఆఫీసర్లలా ఎలా ప్రవర్తించాలో కిడ్నాపర్లు నేర్చుకున్నారట.. ఈ సినిమా చూసే రిహార్సల్స్ చేసినట్టు తేలింది.

    ఈ మొత్తం రిహార్సల్స్ ను భార్గవ్ రామ్ సోదరుడు, అఖిలప్రియ మరిది అయిన చంద్రహాస్ చూసుకున్నాడని.. యూసఫ్ గూడలోని తనకు చెందిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో కిడ్నాపర్లకు క్లాసులు తీసుకున్నాడట..

    Also Read: భోగి మంటలెందుకు? భోగి పళ్ళ వేడుకల వెనుక ఉద్దేశ్యమేంటి? సంప్రదాయం వెనుక కథ

    అంతేకాదు శ్రీనగర్ కాలనీలోని ఓ సినిమా కంపెనీ నుంచి డ్రెస్సులు తెప్పించడం.. ఓ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి నకిలీ ఐడీ కార్డులు తయారీ చేయించడం లాంటి పనులన్నీ ఇతడే చూసుకున్నాడట.. రెండోరోజు పోలీసుల కస్టడీలో ఈ విషయాలను అఖిలప్రియ పంచుకున్నట్టు సమాచారం.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పోలీసుల చేతికి చిక్కాడని.. అతడిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారని తెలిసింది. మిగతా వారు మరింత జాగ్రత్త పడుతారనే ఉద్దేశంతోనే పోలీసులు ఇలా గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్