Vijayawada: ప్రియుడితో ఎఫైర్.. అతని స్నేహితులతో వ్యాపారం.. షాకింగ్ ట్విస్ట్

Vijayawada: డబ్బు సంపాదించే మార్గంలో పలు మోసాలు వెలుగు చూస్తున్నాయి. అయినా ఎవరిలో కూడా పట్టింపు లేదు. కష్టపడి పనిచేస్తే ఫలితాలు వస్తాయని తెలిసినా సులువుగా డబ్బు సంపాదించే మార్గాల వైపు అర్రులు చాస్తున్నారు. దీంతో చిక్కుల్లో పడుతున్నారు. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ తన స్నేహితులతో వ్యాపారం చేసింది. అందులో మోసం చోటుచేసుకోవడంతో బాధ్యురాలు అయింది. అయినా ఊహించని ఘటనలు ఎదుర్కొంది. పలు కోణాల్లో నాటకాలు ఆడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని విజయవాడలోని (Vijayawada) సీతారామపురంకు […]

Written By: Raghava Rao Gara, Updated On : September 6, 2021 10:58 am
Follow us on

Vijayawada: డబ్బు సంపాదించే మార్గంలో పలు మోసాలు వెలుగు చూస్తున్నాయి. అయినా ఎవరిలో కూడా పట్టింపు లేదు. కష్టపడి పనిచేస్తే ఫలితాలు వస్తాయని తెలిసినా సులువుగా డబ్బు సంపాదించే మార్గాల వైపు అర్రులు చాస్తున్నారు. దీంతో చిక్కుల్లో పడుతున్నారు. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ తన స్నేహితులతో వ్యాపారం చేసింది. అందులో మోసం చోటుచేసుకోవడంతో బాధ్యురాలు అయింది. అయినా ఊహించని ఘటనలు ఎదుర్కొంది. పలు కోణాల్లో నాటకాలు ఆడాల్సి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని విజయవాడలోని (Vijayawada) సీతారామపురంకు చెందిన మహిళ రైల్వే ఉద్యోగితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో అతడి స్నేహితుడి ద్వారా రైల్వే బంధువులతో వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలుకుతూ అందరిని వ్యాపారంలో దించే వారు. ఇలా సాగుతున్న వారి వ్యాపారానికి అకస్మాత్తుగా బ్రేక్ తగిలింది. పలువురి నుంచి ముందుగానే డబ్బు తీసుకుంది. కానీ వారికి బంగారం ఇవ్వడం లేదు.

డబ్బులిచ్చిన వారు బంగారం ఎప్పుడిస్తారు అని గొడవ చేయడం ప్రారంభించారు. రేపు మాపు అంటూ దాటవేస్తుండడంతో అందరిలో అనుమానాలు పెరిగిపోయాయి. అసలు బంగారం ఇస్తారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సుబ్బారావు అనే వ్యక్తి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆగస్టు 31న రాత్రి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లి ఓ ఇంట్లో బంధించి దాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకుంది.

ఈ నేపథ్యంలో మారో డ్రామాకు తెర తీశారు. ఆమెకు డబ్బులివ్వాల్సిన ఓ వ్యక్తి ఫోన్ చేసి పదో నెంబర్ ప్లాట్ ఫాంకు రావాలని సూచించగా ఆమె మరో యువతిని తీసుకుని కారులో బయలుదేరగా ఆమె కిడ్నాప్ కు గురైందని పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో సిటీ అంతా అలర్టయిన పోలీసులు కారును గుర్తించి అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే మహిళపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రూ. 5 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అయితే మహిళను నమ్మి అంత మొత్తంలో డబ్బులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే ఉద్యోగులు బంగారం కోసం ఇంత దిగజారిపోయి వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది. ఇందులో బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని పోలీసులు పేర్కొంటున్నారు.