https://oktelugu.com/

కేసీఆర్ టాప్ సీక్రెట్ మీటింగ్.. కథేంటి?

రాజకీయ రణధీరుడు కేసీఆర్ రచించే వ్యూహాలు ఆయన కుటుంబ సభ్యులకు కూడా అర్థం కావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కేసీఆర్ వేసే ఎత్తుగడలకు తట్టుకోలేక ప్రతిపక్షాలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. అందుకే ఆరేండ్లలో ఎక్కడా మడమ తిప్పకుండా పరిపాలన చేస్తున్నాడు. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో కేసీఆర్ కు కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే మొత్తానికి ఆరేళ్ల పరిపాలన తరువాత ఆయన అనుకున్న సీటు ఓడిపోవడం ఇదే మొదటిసారి. దీనికి ప్రతీకారాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 08:38 AM IST
    Follow us on

    రాజకీయ రణధీరుడు కేసీఆర్ రచించే వ్యూహాలు ఆయన కుటుంబ సభ్యులకు కూడా అర్థం కావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కేసీఆర్ వేసే ఎత్తుగడలకు తట్టుకోలేక ప్రతిపక్షాలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. అందుకే ఆరేండ్లలో ఎక్కడా మడమ తిప్పకుండా పరిపాలన చేస్తున్నాడు. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో కేసీఆర్ కు కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే మొత్తానికి ఆరేళ్ల పరిపాలన తరువాత ఆయన అనుకున్న సీటు ఓడిపోవడం ఇదే మొదటిసారి. దీనికి ప్రతీకారాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించినా కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరగుతుందనడంలో అతిశయోక్తి కాదు.

    Also Read: ఎన్నికలు కాని ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు

    ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి కేసీఆర్ అప్రమత్తమయ్యారు. హుటాహుటిన బుధవారం పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలతో సహా అందరినీ సమావేశానికి రావాలని హుకూం జారీ చేశారు. మంత్రులు, ఎంపీలు తమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ సమావేశానికి రావాలని తెలిపారు.

    అయితే ఈ సమావేశం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమని అధికారికంగా ప్రకటించకపోయినా ఎందుకు ఇంత హడావుడి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశమవుతారు. ప్రస్తుతానికి అలాంటి పరిస్థతి లేదు. దీంతో ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.

    Also Read: టీఆర్ఎస్ లో మేయర్ పీఠం ఆశావహులు వీరే..

    దుబ్బాక ఎన్నిక వరకు కాస్త ఏమరపాటుగా ఉన్న కేసీఆర్ ఆ స్థానం ఓడిపోవడంతో అప్రమత్తమయ్యారు. అప్పటి నుంచి అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ప్రగతిభవన్ లో నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ నాయకులతో పాటు మజ్లిస్ నేతలను కూడా ఆహ్వానించారు. అప్పుడు సమావేశ వివరాలు తెలుపకపోయినా గ్రేటర్ ఎన్నికల కోసమేనని అందరూ భావించారు. ఆ తరువాత అదే నిజమైంది.

    అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని ముఖ్య ప్రజాప్రతినిధులను సమావేశానికి రమ్మనడం చర్చనీయాంశంగా మారింది. ఏదీ ఏమైనా బుధవారం మధ్యాహ్నం వరకు సమావేశ వివరాలు బయటకు వస్తాయని పార్టీలోని ఇతర నాయకులు భావిస్తున్నారు.