https://oktelugu.com/

టీఆర్ఎస్ లో మేయర్ పీఠం ఆశావహులు వీరే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ వాసులకు ఎన్నికల పండుగ రానే వచ్చింది. హైదరాబాద్ లో 14 రోజుల పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి కనిపించనుంది. ప్రచారాల హోరు.. హామీల జోరుతో నగరం మారుమోగనుంది. మాటల తూటాలు.. ఓట్ల కోసం వేసే ఫీట్లతో జనాన్ని ఆకట్టుకోవడానికి ఆయా రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. ఎవరేం చేసినా వారి దృష్టిలో ప్రస్తుతం ఓటరు మాత్రమే దేవుడు. ఆ ఓటరు కోసం ఏదైనా చేయడానికి సదరు నాయకులు ప్రజల వద్దకు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 2:53 pm
    Follow us on

    GHMC Elections 2020

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ వాసులకు ఎన్నికల పండుగ రానే వచ్చింది. హైదరాబాద్ లో 14 రోజుల పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి కనిపించనుంది. ప్రచారాల హోరు.. హామీల జోరుతో నగరం మారుమోగనుంది. మాటల తూటాలు.. ఓట్ల కోసం వేసే ఫీట్లతో జనాన్ని ఆకట్టుకోవడానికి ఆయా రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. ఎవరేం చేసినా వారి దృష్టిలో ప్రస్తుతం ఓటరు మాత్రమే దేవుడు. ఆ ఓటరు కోసం ఏదైనా చేయడానికి సదరు నాయకులు ప్రజల వద్దకు రాబోతున్నారు.

    Also Read: కేసీఆర్ టాప్ సీక్రెట్ మీటింగ్.. కథేంటి?

    హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మంగళవారం షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కావడం.. వచ్చే నెల 1న పోలింగ్, 4న ఓట్ల లెక్కింపు ఉండడంతో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియకు కేవలం 14 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న కొద్ది కాలంలో ప్రచారంతో ప్రజల్ని ఆకట్టుకొని తమ సత్తా చూపించాలని పార్టీలు సిద్ధమవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఇప్పటికే రకరకాల వ్యూహాలతో ఎన్నికలకు సై అంటోంది. ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకొని మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇక దుబ్బాకలో గెలిచిన ఊపుతో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. దుబ్బాకలో మూడో స్థానానికి వెళ్లిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనైనా గౌరవప్రదమైన గెలుపు కోసం ఆరాటపడుతోంది.

    Also Read: ఎన్నికలు కాని ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు

    కాగా జీహెచ్ఎంసీ మేయర్ సీటును జనరల్ మహిళకు కేటాయించారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయమేనని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు మేయర్ పీఠాన్ని తమ కుటుంబ సభ్యులకే కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కొందరు ప్రముఖులు తమ కూతుళ్లు, కోడళ్లను బరిలోకి దింపి మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో కొందరు ఆశావహుల పేర్లు బయటికి వచ్చాయి.

    మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కోడలు, మంత్రి మల్లారెడ్డి కూతురు, ఎంపీ కేకే కూతురు విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు, పి.జనార్దన్ రెడ్డి కూతురు విజయ, బొంతు రామ్మోహన్ భార్య, మంత్రి సబిత ఇంద్రారెడ్డి కోడలు తదితరులు మేయర్ పీఠం కోసం ఆయా డివిజన్లలో బరిలోకి దిగనున్నారు. అయితే చివరికి ఎవరిని మేయర్ పీఠం వరిస్తుందో చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్