‘సాగర్’ పై గురిపెట్టిన కేసీఆర్.. సత్తా చాటేనా?

సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. ఈక్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఆపార్టీపై వ్యతిరేక మొదలైంది. ఇన్నిరోజులు టీఆర్ఎస్ ను అక్కున చేర్చుకున్న పలువర్గాలు ఆపార్టీకి దూరం జరుగుతున్నాయి. Also Read: వెడ్డింగ్ కార్డ్ పై క్యూఆర్ కోడ్.. చదివింపులు నేరుగా ఖాతాలోకి..? ప్రధానంగా నిరుద్యోగ యువత.. ఉద్యోగులు.. ప్రైవేట్ ఉద్యోగులు తదితర వర్గాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ ప్రభావంతోనే […]

Written By: NARESH, Updated On : January 19, 2021 5:24 pm
Follow us on

సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. ఈక్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఆపార్టీపై వ్యతిరేక మొదలైంది. ఇన్నిరోజులు టీఆర్ఎస్ ను అక్కున చేర్చుకున్న పలువర్గాలు ఆపార్టీకి దూరం జరుగుతున్నాయి.

Also Read: వెడ్డింగ్ కార్డ్ పై క్యూఆర్ కోడ్.. చదివింపులు నేరుగా ఖాతాలోకి..?

ప్రధానంగా నిరుద్యోగ యువత.. ఉద్యోగులు.. ప్రైవేట్ ఉద్యోగులు తదితర వర్గాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ ప్రభావంతోనే ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక రిజల్ట్ వచ్చాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలుకాగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం టీఆర్ఎస్ కు అందనంత దూరంలో నిలిచింది.

మరోవైపు టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ తెలంగాణలో బలపడుతుంటం ఆపార్టీకి కంటగింపుగా మారింది. ఈక్రమంలోనే రాబోయే నాగార్జున్ ఉప ఎన్నిక.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ సత్తాకు సవాలుగా మారాయి. దీంతో టీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్ నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలపై నేరుగా రంగంలోకి దిగుతున్నారు.

Also Read: వైరల్ : లక్ష్మీపార్వతి ఇంట చిన్న ఎన్టీఆర్ వచ్చాడు!

నాగార్జున్ సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక కాడినుంచి ప్రచారం.. వ్యూహాలన్నింటినీ సీఎం కేసీఆరే దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున్ సాగర్లో పెండింగులో ఉన్న పనులన్నింటిని ప్రభుత్వం ఎన్నికల వరకు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఆ జిల్లాలకు మరిన్ని వరాలను సీఎం కేసీఆర్ ప్రకటిస్తున్నారు.

నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కంటే ముందే లక్షమందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొని టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేయనున్నారు. ఈ ఉప ఎన్నికలో గెలుపును సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆమేరకు సిద్ధమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్