తెలంగాణ సీఎం కేసీఆర్ అంతరంగాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమంటారు. ఆయన ఎప్పుడు ఎక్కడ.. ఎలా చేస్తారో ఎవ్వరికి అర్థం కాదంటారు. అయితే ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే విషయంలో కేసీఆర్ ఫెయిల్ అవుతుంటారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ‘కేసీఆర్ గర్భగుడి(ప్రగతి భవన్) వదిలి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రావాలి’ అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లాంటి వారు విమర్శిస్తుంటారు. అయినా కూడా కేసీఆర్ నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేది చాలా తక్కువే అని చెప్పొచ్చు.
Also Read: హైదరాబాద్ అతలాకుతలం.! జనజీవనం అస్తవ్యస్తం
ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినా.. సమ్మెలు జరిగినా తన ప్రగతి భవన్ కు వారిని రప్పించుకొని ఫుష్ఠిగా చికెన్, మటన్ పెట్టించి వారి కడుపు నింపి వరాలు ప్రకటించి సంతృప్తి పంపడం కేసీఆర్ కు అలవాటు.
దివంగత వైఎస్ఆర్ లాగా.. ఏపీ సీఎం జగన్ లాగా ప్రజల్లోకి వెళ్లి సభలు, సమావేశాలు పెట్టి ఇంటరాక్ట్ అయ్యే టైపు కేసీఆర్ కాదన్న విమర్శ రాజకీయవర్గాల్లో ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగింది..!
హైదరాబాద్ లో తీవ్ర వాయుగుండంతో వర్షాలు ప్రళయ భీకరంగా కురిసాయి. కాలనీలన్నీ మునిగిపోయాయి. కార్లన్నీ కొట్టుకుపోయాయి. కరెంట్ లేక చిమ్మీ చీకట్లు జనాలు భిక్కుభిక్కుమంటూ గడిపారు. ఇక ఇళ్లు మునిగి పునావాసం లేక జనాలు నానా ఇబ్బందులు పడ్డారు. మంత్రి కేటీఆర్ కొన్ని ప్రాంతాల్లో పర్యటించి కార్పొరేట్లను హెచ్చరించి వెళ్లిపోయారు.
Also Read: తెలంగాణలో అంత్యక్రియలకు ముందు మూలిగిన యువతి.. చివరకు..?
కానీ తెలంగాణ పాలకుడిగా కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ నుంచి కదిలిరాలేదు. ఆ భవనాన్ని వీడలేదు. కేవలం అధికారులతో సమీక్షలు చేసి సరిపెట్టారు. కేసీఆర్ వచ్చి ప్రజల కష్టాలు చూసి నేరుగా సాయం చేస్తాడని అందరూ అనుకున్నారు. దేశమంతా ఈ హైదరాబాద్ విపత్తు గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ మాత్రం ఇళ్లు కదలకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై హైదరాబాద్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. 100 ఏళ్లలో రాని వరదలు హైదరాబాద్ ను ముంచెత్తి నానా బీభత్సం జరుగుతున్నా.. కేసీఆర్ హైదరాబాద్ లో ఉండి ప్రజలకు భరోసా కల్పించకుండా.. వారిని స్వయంగా పరిశీలించి ధైర్యం చెప్పకుండా చోద్యం చూసిన వైనంపై విమర్శలు చెలరేగుతున్నాయి.