ట్రంప్ vs జోబైడెన్.. ఎవరికి విరాళాలు ఎక్కువొచ్చాయంటే?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ ఆయన పోటీగా జో బైడెన్‌ నిలిచారు. ఇద్దరి మధ్య ఈ సారి పోటీపోటా కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు విరాళాలు సైతం పోటెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో గత సెప్టెంబర్‌లో బైడెన్‌కు 383 మిలియన్ డాలర్ల విరాళం సమకూరింది. బుధవారం నాటికి ఆయన బ్యాంకు ఖాతాలో 432మిలియన్ […]

Written By: NARESH, Updated On : October 15, 2020 12:06 pm
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ ఆయన పోటీగా జో బైడెన్‌ నిలిచారు. ఇద్దరి మధ్య ఈ సారి పోటీపోటా కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు విరాళాలు సైతం పోటెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో గత సెప్టెంబర్‌లో బైడెన్‌కు 383 మిలియన్ డాలర్ల విరాళం సమకూరింది. బుధవారం నాటికి ఆయన బ్యాంకు ఖాతాలో 432మిలియన్ డాలర్లు ఉన్నట్లు డెమోక్రాటిక్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. డెమోక్రాటిక్ నేషనల్ కమిటీలు, క్యాంపెయిన్స్ జాయింట్ ఫండ్ రైసింగ్ కమిటీలు సంయుక్తంగా ఈ విరాళాల సేకరించాయి. మరో అభ్యర్థి ట్రంప్‌ మాత్రం ఇంకా సెప్టెంబర్‌‌ నెలకు సంబంధించిన విరాళాలు వెల్లడించలేదు.

Also Read: అప్పుడు వాజ్ పేయి.. ఇప్పుడు మోడీ.. పెట్రోల్ పై సంచలన నిర్ణయం?

మొదట్లో విరాళాల విషయంలో ట్రంప్‌ కంటే బైడెన్‌ చాలా వెనుకబడ్డాడు. కానీ.. ఇప్పుడు అనూహ్యంగా పుంజుకున్నారు. గత ఆగస్టులో ప్రస్తుత అధ్యక్షుడు,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 365 మిలియన్ డాలర్ల విరాళాలు సమకూరగా.. బైడెన్‌కు కేవలం 154 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. సెప్టెంబర్ నెలలో ఆన్‌లైన్ ద్వారా బైడెన్‌కు భారీ విరాళాలు వచ్చి చేరాయి. దాదాపు 203మిలియన్ డాలర్ల పైచిలుకు విరాళాలు ఆన్‌లైన్ ద్వారానే సమకూరాయి. ఆగస్టులో కమల హ్యారిస్‌ను డెమోక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలిగా ప్రకటించాకే బైడెన్‌కు విరాళాలు పెరిగినట్లు చెబుతున్నారు.

ట్రంప్‌తో మొదటి అధ్యక్ష డిబేట్‌ను సెప్టెంబర్‌‌ చివరలో నిర్వహించగా.. ఆ సమయంలో బైడెన్‌కు భారీ విరాళాలు వచ్చాయి. సెప్టెంబర్ 29న ఆ డిబేట్ జరగ్గా ఆరోజు రాత్రి 9గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 10 మిలియన్ డాలర్లు చేకూరాయి. ఇందులో రాత్రి 9గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలోనే ఏకంగా 3.8మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయి. ఒక్క గంటలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 30న కూడా బైడెన్‌కు 21మిలియన్ డాలర్ల విరాళాలు సమకూరాయి. బైడెన్‌ వద్ద ఇప్పుడు చేతి నిండా డబ్బు ఉండటంతో పొలిటికల్ క్యాంపెయిన్స్‌కు, ప్రకటనలకు మరింత ఖర్చు చేసే అవకాశం ఉంది.

Also Read: తెలంగాణలో అంత్యక్రియలకు ముందు మూలిగిన యువతి.. చివరకు..?

ఈ సారి ఈ అధ్యక్ష ఎన్నికలు చాలా ఖర్చైనవి అన్నట్లుగా అర్థమవుతోంది. దాదాపు 11 మిలియన్‌ డాలర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2008 అధ్యక్ష ఎన్నికల కంటే ఇది రెట్టింపు కాగా.. 2016 అధ్యక్ష ఎన్నికల కంటే 50శాతం అధికం. అయితే ఇంత భారీ మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేయడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం 1974లో మొదలైంది. కానీ.. అప్పట్లో చాలా పరిమితులు, తక్కువ మొత్తం మాత్రమే ఖర్చు చేయాలన్న నిబంధనలు ఉండేవి. దాదాపు రెండు దశాబ్దాల పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్స్‌లో ఇది కీలక పాత్ర పోషించింది. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ప్రజల నుంచి సేకరించే విరాళాల కంటే సంపన్నులు, బడా కంపెనీలు ఇచ్చే విరాళాలే ఎక్కువయ్యాయి. ఒక రకంగా ఇప్పుడు ఎన్నికల్లో ధన ప్రవాహమంతా ప్రైవేట్ మనీయే. ఇలా ఎన్నికలను ప్రైవేట్ సంస్థలు భారీ విరాళాలతో ప్రభావం చేయడం ఫెడరల్ వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.