సీఎం కేసీఆర్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి తనకు నీడలా ఉన్న సీఎంఓలోని ఓ కీలక అధికారిని కేసీఆర్ ఉన్నపళంగా తొలగించారన్న వార్త కలకలం రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతస్థాయి ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)గా గా కొనసాగుతున్న ప్రముఖ జర్నలిస్ట్ విజయ్ కుమార్ ను తొలగించడం బుధవారం మీడియా వర్గాలలో పెద్ద సంచలనంగా మారింది.
సీఎంఓ పీఆర్వోగా ఉన్న విజయ్ కుమార్ తన పదవికి నిన్న రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ స్టేట్ ట్రాన్స్ కో లో జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే కేసీఆర్ పీఆర్వోగా ఆయన వెన్నంటే ఉంటారు.
మీడియా సమూహాలలో.. కీలక సమావేశాల్లో కేసీఆర్ వెంటే విజయ్ కుమార్ ఉంటారు. ఆయనపై అవినీతి ఆరోపణల కారణంగానే తీసిసినట్టు ప్రచారం సాగుతోంది. అవినీతి.. మరియు కీలక విషయాలను విజయ్ కుమార్ లీక్ చేసిన కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసేసినట్టు మీడియా సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
ఇక ఇలాంటి సమస్యే ఏపీలోనూ ఉంది. ఏపీలో వేగవంతమైన అభివృద్ధి కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ టీడీపీకి లీక్ అయిపోవడం చూస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిణామాలు ప్రభుత్వానికి చేటుతెస్తున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ లాగే తన సీఎంఓను ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిని జగన్ సరిచేస్తారనే చర్చ మీడియా వర్గాలలో సాగుతోంది.
సీఎంవోలో కొందరు అధికారులు కూడా అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని.. వారు పెద్ద ఎత్తున లాబీయింగ్ తో డబ్బు సంపాదించారని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులలో సమన్వయ లోపం కూడా ఉందంటున్నారు. ఇది సమాచార ప్రవాహంలో చాలా సమస్యలకు దారితీస్తుందని వారు అంటున్నారు.
“ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిపాలనను, ముఖ్యంగా సీఎంవోని సరిదిద్దవలసిన అవసరం ఉంది. జగన్ చెడు అంశాలను గుర్తించి వాటిని ఒకదాని తరువాత ఒకటి పరిష్కరించాలన్న డిమాండ్ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.