https://oktelugu.com/

బీజేపీకి టైం ఇవ్వొద్దు.. సర్దుకునే చాన్స్ లేకుండా కేసీఆర్ ప్లాన్?

ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో దెబ్బతిన్న టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఇక గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. దుబ్బాకలో విజయంతో మరింత ఊపులో ఉన్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఆ పార్టీకి ఎన్నికలకు సమాయత్తం అయ్యే ఛాన్స్‌ కూడా ఇవ్వకుండా వెంటనే సిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నాలు సాగిస్తోంది. Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ కేవలం 20 రోజుల్లోనే అంటే డిసెంబర్‌‌ 4న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేయాలని వార్తలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 10:28 AM IST
    Follow us on

    ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో దెబ్బతిన్న టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఇక గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. దుబ్బాకలో విజయంతో మరింత ఊపులో ఉన్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఆ పార్టీకి ఎన్నికలకు సమాయత్తం అయ్యే ఛాన్స్‌ కూడా ఇవ్వకుండా వెంటనే సిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నాలు సాగిస్తోంది.

    Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్

    కేవలం 20 రోజుల్లోనే అంటే డిసెంబర్‌‌ 4న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేయాలని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా చూస్తే దుబ్బాక ఫలితం తారుమారు కావడంతో రెండు మూడు నెలల వరకు గ్రేటర్‌‌ ఎన్నికలు నిర్వహించరేమో అన్న అనుమానాలు ఉన్నాయి నిన్నటివరకు. పైగా పాలకవర్గం కాల పరిమితికి కూడా సమయం ఉంది కాబట్టి మెల్లగా వెళ్తారని అనుకున్నారు అంతా. కానీ టీఆర్‌‌ఎస్‌ పార్టీ అలా ఆలోచించడం లేదు. అంత సమయం ఇచ్చి, సిటీలో బీజేపీ తగిన వ్యూహరచన, అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా పద్ధతిగా వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఇప్పుడే చేసేస్తే బీజేపీ సర్దుకునే సరికి చాలా టైం పడుతుందనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే భారీ వరదల నేపథ్యంలో గ్రేటర్‌‌ ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. సాయం అందించాల్సింది పోయి.. ఎక్కడికక్కడ లీడర్లు దండుకుంటున్నారనే వార్తలు ఉన్నాయి. అలాగే.. కరోనా విషయంలోనూ ప్రభుత్వం ఫెయిలైందనే అభిప్రాయాలు జనంలో ఉన్నాయి. మరోవైపు దుబ్బాకలో నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి.

    Also Read: అసలు జీహెచ్ఎంసీపై కేసీఆర్ ప్లాన్ ఏంటి?

    దీంతో టీఆర్ఎస్‌కు ఏ కోశాన చూసినా పాజిటివ్‌ కనిపించడం లేదు. అలాంటి సమయంలో ఎన్నికలు వస్తే జనం ఎలా రియాక్ట్ అవుతారో క్లారిటీ లేదు. కానీ.. అధికార పార్టీ మాత్రం జనాల ఆలోచన సంగతి పక్కన పెట్టి, బీజేపీకి టైం ఇవ్వొద్దని ఆలోచిస్తోంది. సమయం లేకుండా ఉక్కిరి బిక్కిరి చేయడం మీదే దృష్టి పెట్టాలని చూస్తోంది. అందుకే.. వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్