https://oktelugu.com/

అక్కినేని హీరోలను లైన్లో పెట్టిన అనిల్ రావిపూడి?

అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ కు వీడదీయరాని బంధం ఉంది. టాలీవుడ్ పరిశ్రమ హైదరాబాద్ కు తరలిరావడానికి అక్కినేని నాగేశ్వర్ రావు ప్రధాన కారణమనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక అదే ఫ్యామిలీకి చెందిన కింగ్ నాగార్జున అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుత కుర్రహీరోలకు ధీటుగా నాగార్జున సినిమాలు చేస్తున్నాడు. ఆయన కుమారులు నాగ చైతన్య.. అఖిల్ కూడా టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు. Also Read: కాజల్ నో సీక్రెట్స్.. హనీమూన్ తో సహా అన్నీ చూపిస్తోంది? అక్కినేని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 10:23 AM IST
    Follow us on

    అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ కు వీడదీయరాని బంధం ఉంది. టాలీవుడ్ పరిశ్రమ హైదరాబాద్ కు తరలిరావడానికి అక్కినేని నాగేశ్వర్ రావు ప్రధాన కారణమనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక అదే ఫ్యామిలీకి చెందిన కింగ్ నాగార్జున అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుత కుర్రహీరోలకు ధీటుగా నాగార్జున సినిమాలు చేస్తున్నాడు. ఆయన కుమారులు నాగ చైతన్య.. అఖిల్ కూడా టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు.

    Also Read: కాజల్ నో సీక్రెట్స్.. హనీమూన్ తో సహా అన్నీ చూపిస్తోంది?

    అక్కినేని నాగేశ్వర్ రావు.. కింగ్ నాగార్జున.. యంగ్ హీరోలు నాగ చైతన్య.. అఖిల్.. అక్కినేని కోడలు సమంత వీరంతా కలిసి ‘మనం’లో నటించారు. మూడుతరాల నటులతో దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన ‘మనం’ టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. నాగేశ్వర్ రావు చివరి చిత్రం కూడా ‘మనం’ సినిమానే కావడం గమనార్హం.

    తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవలే మహేష్ బాబుతో ‘సరిలేరునికెవ్వరు’ మూవీని తెరకెక్కించి ఇండస్ట్రీ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఎఫ్-2కు సిక్వెల్ గా ఎఫ్-3 తీసుకురానున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ మూవీ ఆలస్యమయ్యేలా కన్పించడంతో ఈలోపు అక్కినేని ఫ్యామిలీతో ఓ మూవీ చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు.

    Also Read: చిరంజీవి కరోనా అప్ డేట్.. ఏమైందంటే?

    అక్కినేని నాగార్జున.. యంగ్ హీరో అఖిల్‌తో ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈమేరకు కింగ్ నాగార్జునను కలిసి కథ కూడా వినిపించాడని తెలుస్తోంది. ఈ కథకు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ మూవీని వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్లో వినిపిస్తోంది. ఈ మూవీ ‘మనం’ తరహాలో ఉంటుందా? లేక మరేదైనా ఢిపరెంట్ స్టైల్లో ఉంటుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్