తెలంగాణ సెంటిమెంట్ ఇక పనిచేయదా?

‘పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోడ్ని పోశమ్మ కొట్టిందట’ ఇది పక్కా తెలంగాణ సామెత. తెలంగాణలో తమకు ఎదురే లేదని ఇన్నాళ్లు బీరాలు పలికిన టీఆర్‌‌ఎస్‌ పార్టీకి దుబ్బాకలో చేదు అనుభవం ఎదురైంది. తాము ఏది చెబితే ప్రజలు అదే నమ్మేస్తారని.. తాము చెప్పిందే ఫైనల్‌ అన్నట్లు ఇన్నాళ్లు ధీమాతో ఉన్న టీఆర్‌‌ఎస్‌కు దుబ్బాక ప్రజలు కళ్లు తెరిపించారు. ప్రజాస్వామ్యంలో అహంకారం పనికి రాదని తేల్చేశారు. Also Read: బీజేపీకి టైం ఇవ్వొద్దు.. సర్దుకునే చాన్స్ లేకుండా కేసీఆర్ […]

Written By: NARESH, Updated On : November 13, 2020 11:26 am
Follow us on

‘పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోడ్ని పోశమ్మ కొట్టిందట’ ఇది పక్కా తెలంగాణ సామెత. తెలంగాణలో తమకు ఎదురే లేదని ఇన్నాళ్లు బీరాలు పలికిన టీఆర్‌‌ఎస్‌ పార్టీకి దుబ్బాకలో చేదు అనుభవం ఎదురైంది. తాము ఏది చెబితే ప్రజలు అదే నమ్మేస్తారని.. తాము చెప్పిందే ఫైనల్‌ అన్నట్లు ఇన్నాళ్లు ధీమాతో ఉన్న టీఆర్‌‌ఎస్‌కు దుబ్బాక ప్రజలు కళ్లు తెరిపించారు. ప్రజాస్వామ్యంలో అహంకారం పనికి రాదని తేల్చేశారు.

Also Read: బీజేపీకి టైం ఇవ్వొద్దు.. సర్దుకునే చాన్స్ లేకుండా కేసీఆర్ ప్లాన్?

తెలంగాణలో ఏ సమస్య వచ్చినా దానికి జై తెలంగాణ అనే నినాదాన్ని జోడించడం.. ప్రజల్లో ఉన్న ప్రాంతీయాభిమానాన్ని వాడుకుంటూ ఇన్నాళ్లు టీఆర్‌‌ఎస్‌ నెట్టుకొచ్చింది. కానీ.. తదుపరి అలా ఎలా మారిందంటే ప్రజలను తక్కువ అంచనా వేయడం ప్రారంభించారు. అక్కడే అసలు సమస్య వచ్చింది. ప్రజలకే ఏవో రెండు పథకాలు పెట్టి.. ఎంతో కొంత సాయం చేస్తే.. వారే తర్వాత ఓటు వేస్తారని అనుకోవడం ప్రారంభించారు. అక్కడే పతనం ప్రారంభమయింది. సాధారణంగా ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ఉపఎన్నికల్లో అధికార పార్టీ ఓడదు. నంద్యాల ఉప ఎన్నికల అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

కానీ దుబ్బాకలో మాత్రమే ఫలితం తేడా కొట్టింది. అంటే ప్రజలు కారు పార్టీకి షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే. ఒక్క సారి అధికారం అందితే ప్రజలు తమకు పెత్తనం చేయడానికి అధికారం ఇచ్చారని.. ఏమైనా చేయవచ్చనుకునే తాజా అధికారవాదుల వల్లనే సమస్య వస్తోంది. టీఆర్ఎస్‌ మొదట అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ కోసం పోరాడారన్న భావన ఉండేది. వారు ఏం చేసినా తెలంగాణ కోసమే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉండేది. అందుకే పెద్ద ఎత్తున సపోర్ట్ చేసేవారు. అందుకే పాలేరు లాంటి నియోజకవర్గాల ఉపఎన్నికలలో వేలకు వేల మెజార్టీ వచ్చింది. కానీ తెలంగాణ ప్రజల మద్దతును టీఆర్ఎస్ నేతలు అలుసుగా తీసుకున్నారు. అధికారం కోసం అన్ని పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ప్రజలను అవమానించడం ప్రారంభించారు.

Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్

ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయం ఉండకుండా చేసుకోవడం అసాధ్యం. అలా అనుకుంటే.. అంతకు మించిన అహంకారం ఉండదు. కానీ టీఆర్ఎస్ అదే చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించి ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఎంతకైనా పోయింది. కానీ.. ఇప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. బీజేపీ కాకపోతే ఇంకో పార్టీ వస్తుంది. ఇక్కడ ప్రత్యామ్నాయం ప్రజలు సృష్టించుకుంటారు. ఎందుకంటే వారి చేతుల్లో ఓటు అనే ఆయుధం ఉంది. ఒక్క సారి బీజేపీ ఎదగడం ప్రారంభిస్తే ఎంత ప్రమాదకరమో టీఆర్ఎస్‌కు, ఆ పార్టీ అధినేతకు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్