Also Read: పవన్ వెంట మనోహరుడు.. ఇందుకేనా?
కేసీఆర్ చాణిక్యం ముందే జాతీయ పార్టీలైనా.. లోకల్ పార్టీలైనా బిస్తరు కట్టాల్సిందే. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత సోనియాగాంధీకే హ్యాండిచ్చారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ తో పెట్టుకున్న చంద్రబాబుకు ఆ తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ రిటర్న్ గిప్ట్ ఇచ్చి బదులు తీర్చుకున్నాడు.
కేసీఆర్ వ్యూహాలు రచిస్తే ఎంత పెద్ద మేధావులైనా.. రాజకీయ పండితులైన సరే అమోమయంలో పడిపోవాల్సిందే. తాజాగా కేసీఆర్ ట్రాప్ లో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఇరుక్కుపోయినట్లు కన్పిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నామంగా మారుతున్న బీజేపీని సీఎం కేసీఆర్ ఒక్క ఢిల్లీ టూరుతో అమోమయంలో పడేశారు.
నిన్నటి దాకా టీఆర్ఎస్ పై దూకుడుగా వెళ్లిన బీజేపీ నేతలంతా సైలంటై పోయారు. నిన్నటి వరకు తెలంగాణలో సీఎం కేసీఆర్ పని పోయిందని.. ఆయన ఢిల్లీ వెళితే పట్టించుకునే వారుండని బీజేపీ నేతలు విమర్శించారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీజేపీలోని ముఖ్య నేతలు.. కేంద్రమంత్రులు.. ప్రధాని మోదీతో భేటీ అవడంతో స్థానిక బీజేపీ నేతలు బిత్తర చూపులు చూడాల్సి వచ్చింది.
Also Read: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు విరుగుడుగా.. కేసీఆర్ పదవుల పందేరం..!
బీజేపీ పెద్దలు సీఎం కేసీఆర్ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకడం స్థానిక నేతలకు మింగుడపడటం లేదు. గతంలోనూ బండి లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రులు సీఎం కేసీఆర్ పథకాలపై ప్రశంసలు కురిపించడంతో స్థానిక నేతలు చిక్కుల్లో పడ్డారు.
తెలంగాణలో ప్రస్తుతం మంచి మైలేజ్ తో దూసుకెళుతున్న బీజేపీని ఇరుకున పెట్టేలా ఢిల్లీ పెద్దలు వ్యవహరించడంతో రాష్ట్ర నేతలు అమోమయానికి గురవుతున్నారు. నిన్నటి వరకు కేసీఆర్ పై ఒంటికాలిపై లేచిన బండి సంజయ్.. ఎంపీ అరవింద్ లు ఒక్కసారిగా సైలంటయ్యారు.
ఢిల్లీ పెద్దలతోనే రాష్ట్ర బీజేపీ నేతల కంటిని పొడిచేలా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగినట్లు కన్పిస్తోంది. అటూ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు స్థానిక బీజేపీ నేతలను ఢిపెన్స్ లో పడేసేలా కేసీఆర్ వ్యవహరించిన తీరు ఆయనలోని చాణిక్యానికి నిదర్శంగా కన్పిస్తోంది. కేసీఆర్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ నుంచి బీజేపీ నేతలు ఇప్పట్లో బయటపడేలా కన్పించడం లేదనే టాక్ విన్పిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్