https://oktelugu.com/

బాక్సర్ కోసం వెతుకుతున్న ఫైటర్ !

మొత్తానికి పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న “ఫైటర్” సినిమా పై ఇప్పటికీ అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి, నిన్నటివరకూ ఈ సినిమా ఆగిపోయింది అని ప్రచారం చేశారు. అయితే ఈ సినిమా టీం ఇప్పుడు షూటింగ్ అప్ డేట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఇక్కడే మొదలుపెట్టాలా? లేక విదేశాల్లో మొదలుపెట్టాలా అని ఇంకా తేల్చుకోలేదట టీం. ముందుగా విదేశాల నుంచి ఫైటర్స్ రావాలని.. […]

Written By:
  • admin
  • , Updated On : December 13, 2020 / 04:54 PM IST
    Follow us on


    మొత్తానికి పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న “ఫైటర్” సినిమా పై ఇప్పటికీ అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి, నిన్నటివరకూ ఈ సినిమా ఆగిపోయింది అని ప్రచారం చేశారు. అయితే ఈ సినిమా టీం ఇప్పుడు షూటింగ్ అప్ డేట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఇక్కడే మొదలుపెట్టాలా? లేక విదేశాల్లో మొదలుపెట్టాలా అని ఇంకా తేల్చుకోలేదట టీం. ముందుగా విదేశాల నుంచి ఫైటర్స్ రావాలని.. అలాగే కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించాలని అందుకే ప్రస్తుతం ఆ పాత్ర కోసం నటుడ్ని మేకర్స్ వెతుకున్నారని తెలుస్తోంది.

    Also Read: త్రివిక్రమ్ చేతుల్లోకి ‘రామాయణం’ !

    ఇక డేరింగ్ డైరెక్టర్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే పూరి జగన్నాథ్ చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే ఆ మధ్య వచ్చిన మూవీతో పూరి భారీ విజయాన్నే నమోదు చేయడంతో.. పూరిలో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరిలో మ్యాటర్ తగ్గిపోయిందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో రెగ్యులర్ గా వినిపించేది. ఏది ఏమైనా పూరి పడిపోయి ప్లాప్ ల పాతాళంలో కొట్టుకుపోతున్న ప్రతిసారి.. ఏదొక హిట్ వచ్చి పూరిని నిలబెడుతూ ఉంది.

    Also Read: పవన్ పక్కన అంటే వామ్మో చేయమంటున్న హీరోలు!

    ఇక ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ తన పాత చింతకాయ పచ్చడి గ్యాంగ్ డ్రామాతో మళ్లీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు పూరి. మరి ఈ సినిమా ఎంతవరకూ హిట్ అవుతుందో చూడాలి. విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. అలాగే ఫైటర్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఫైటర్ రూపంలో ఆ అవకాశం రావడంతో అందుకే ఫైటర్ కోసం తెగ కష్ట పడుతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్