https://oktelugu.com/

అమరావతిని కాపాడగలిగేది ఆయన మాత్రమేనట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకొని, అమరావతిని కాపాడగలిగేది ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు మాత్ర‌మే అని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయ‌ణ. కానీ.. అదెలా సాధ్యం అన్నదే ప్రశ్న. Also Read: పవన్ వెంట మనోహరుడు.. ఇందుకేనా? వెంకయ్య చొరవ తీసుకోవాలని.. అమ‌రావ‌తి ఉద్య‌మం ప్రారంభ‌మై ఈ నెల 17 నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో గుంటూరులో శ‌నివారం అమ‌రావ‌తి రాజధాని ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి ఆధ్వర్యంలో మ‌హాపాద యాత్ర నిర్వ‌హించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 / 04:27 PM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకొని, అమరావతిని కాపాడగలిగేది ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు మాత్ర‌మే అని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయ‌ణ. కానీ.. అదెలా సాధ్యం అన్నదే ప్రశ్న.

    Also Read: పవన్ వెంట మనోహరుడు.. ఇందుకేనా?

    వెంకయ్య చొరవ తీసుకోవాలని..
    అమ‌రావ‌తి ఉద్య‌మం ప్రారంభ‌మై ఈ నెల 17 నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో గుంటూరులో శ‌నివారం అమ‌రావ‌తి రాజధాని ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి ఆధ్వర్యంలో మ‌హాపాద యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ మాట్లాడుతూ.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు చొర‌వ తీసుకుంటే రాజ‌ధాని అమ‌రావ‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని సెల‌విచ్చారు. ప్ర‌ధాని మోడీని ఒప్పించి రాజ‌ధాని అమ‌రావ‌తికి వెంక‌య్య శంకుస్థాప‌న చేయించారని, అలాగే.. కేంద్ర భాగ‌స్వామ్యంతో రాజ‌ధాని నిర్మాణానికి స‌యోధ్య కుదిర్చారని చెప్పారు. అంత‌కు ముందు యూపీఏ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్‌తో మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పెట్టించ‌డంలో వెంక‌య్య కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. కాబట్టి, వెంక‌య్య చొర‌వ‌తోనే అమ‌రావ‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అన్నారు నారాయ‌ణ.

    Also Read: ఏపీ ఎలక్షన్ కమిషనర్ కు రెవెన్యూ ఉద్యోగుల షాక్..!

    ఎలా సాధ్యం..?
    ఉప‌రాష్ట్ర‌ప‌తిని ఏ హోదాలో అమ‌రావ‌తి విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని నారాయ‌ణ కోరుతున్నారో అర్థం కాలేదు. ఆయన ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ పదవిలో ఉన్నారు. అలాంటి ఆయన.. ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులపై చ‌ట్టాలు చేస్తే, వాటిని అడ్డుకునేలా ఎలా జోక్యం చేసుకుంటారన్నది నారాయణే చెప్పాలి. మరి, దీనికి నారాయణ ఏం సమాధానం చెబుతారో..?

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్