మోదీని పొగుడుతూ కేసీఆర్ లేఖ.. వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతోంది. దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ చెక్ పెట్టడంతో కేసీఆర్ బీజేపీని శత్రుపార్టీ లిస్టులో చేర్చేశారు. దీంతో గత కొన్నాళ్లుగా కేంద్రంతో సత్సంబంధాలు నేర్పిన కేసీఆర్ భారత్ బంద్ కు మద్దతు ప్రకటించి కేంద్రంపై తిరుగబావుటకు శ్రీకారం చుట్టారు. Also Read: వలంటీర్ల ఉద్యోగాల తొలగింపులో మర్మమేమిటి..? తెలంగాణలో నిర్వహించిన భారత్ బంద్ లో టీఆర్ఎస్ పార్టీ నేతలు అందరికీ కంటే ముందున్నారు. ధర్నాలు.. రాస్తారోకోలతో హోరెత్తించారు. […]

Written By: Neelambaram, Updated On : December 9, 2020 8:19 pm

kcr fight with modi

Follow us on

kcr modi

తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతోంది. దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ చెక్ పెట్టడంతో కేసీఆర్ బీజేపీని శత్రుపార్టీ లిస్టులో చేర్చేశారు. దీంతో గత కొన్నాళ్లుగా కేంద్రంతో సత్సంబంధాలు నేర్పిన కేసీఆర్ భారత్ బంద్ కు మద్దతు ప్రకటించి కేంద్రంపై తిరుగబావుటకు శ్రీకారం చుట్టారు.

Also Read: వలంటీర్ల ఉద్యోగాల తొలగింపులో మర్మమేమిటి..?

తెలంగాణలో నిర్వహించిన భారత్ బంద్ లో టీఆర్ఎస్ పార్టీ నేతలు అందరికీ కంటే ముందున్నారు. ధర్నాలు.. రాస్తారోకోలతో హోరెత్తించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వ్యవసాయ సంస్కరణ పేరిట తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఉన్నట్టుండి సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం అన్ని అవసరాలకు సరిపోవడం లేదని కేంద్రం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని తలపెట్టింది. ఇందులో భాగంగానే సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీనికి డిసెంబర్ 10న(రేపు) ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ లేఖ రాశారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అద్భుతమని.. ఇది దేశ సార్వభౌమత్వాన్నిమరింత ఇనుమడింప చేస్తుందంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ లాగే సీఎం కేసీఆర్ సైతం పాత సచివాలయాన్ని కూల్చి కొత్త భవనాన్ని కడుతున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పలు విమర్శలు గుప్పించారు.

Also Read: ఉండవల్లి వ్యాఖ్యలు.. ఇరకాటంలో వైసీపీ నేతలు..!!

రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు వందల కోట్లతో సచివాలయం నిర్మించడం అవసరమా? అంటూ బీజేపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తాజాగా ప్రధాని మోదీని కొత్త పార్లమెంట్ భవనం కోసం వేలకోట్లు ఖర్చు చేస్తుండటం కేసీఆర్ కు కలిసిరానుంది.

బీజేపీపై పోరాటానికి సిద్ధమైన కేసీఆర్ మోదీ చేసేది మంచి పనైనా ఎండట్టాల్సిన నేపథ్యంలో ప్రధానిని పొగుడుతూ లేఖరాయడం వ్యూహంలో భాగంగా కన్పిస్తోంది. కేసీఆర్ ఏం చేసిన దానిలో ఓ నిగూఢ అర్థం ఉంటుందని.. మోదీకి పొగడ్తల వెనుక కూడా ఏదో తిరకాసు ఉంటుందనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్